Telangana: పార్టీ మార్పుపై తుమ్మల రీయాక్షన్.. ఆత్మీయ సమ్మేళనంలో సంచలన కామెంట్స్..

పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి.. చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చారు టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తన ఆత్మీయుడు భోజనానికి పిలిస్తే వచ్చానన్నారు

Telangana: పార్టీ మార్పుపై తుమ్మల రీయాక్షన్.. ఆత్మీయ సమ్మేళనంలో సంచలన కామెంట్స్..
Thummala Nageshwar Rao

Updated on: Nov 10, 2022 | 8:18 PM

పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారానికి.. చాలా ఫన్నీగా రిప్లై ఇచ్చారు టీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తన ఆత్మీయుడు భోజనానికి పిలిస్తే వచ్చానన్నారు తుమ్మల. ఇంత మంది వస్తారని తానూ అనుకోలేదన్నారు. దీనిపై లేనిపోని ప్రచారం జరుగుతుందే తప్ప.. ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనంలో తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగించిన తుమ్మల.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేయబోతున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చారు తుమ్మల. తన కామెంట్స్‌తో పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలకు తెర దించారు.

జిల్లాతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాల్సిన అవసరం ఉందన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాజకీయాల్లో ఒడిదుడుకు సహజమేనని పేర్కొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 5 సార్లు ఓడానని, 5 సార్లు గెలిచానని చెప్పుకొచ్చారు. నీతిగా, నిబద్ధతతో ఉంటే జీవితకాలం మర్యాద ఉంటుందన్నారు. రాజకీయాల్లో అన్నీ చేసిన వ్యక్తులు ఎక్కడో ఉన్నారని వ్యాఖ్యానించారు తుమ్మల నాగేశ్వరరావు. ఇక ముందు కూడా మీ గౌరవాన్ని తగ్గించకుండా వ్యవహరిస్తానంటూ తన అనుచరులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ములుగు జిల్లా వాజేడులో జరిగిన ఆత్మీయ సమ్మేళనం.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. పార్టీతో సంబంధం లేకుండా కేవలం అనుచరులతోనే మీటింగ్ పెట్టడం సంచలనంగా మారింది. దీంతో తుమ్మల పార్టీ మారుతారనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. తుమ్మల ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? రాజకీయ మార్పు తప్పదా? అనే చర్చ గట్టిగానే నడిచింది. ఇక టీఆర్ఎస్‌లో ఉన్న ఆయన.. ఇటీవల సత్తుపల్లిలో టీడీపీ నేతలతో కలిసి ర్యాలీ, సభలో పాల్గొనడం కొత్త చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ సమావేశం మరింత రాజకీయ సంచలనం సృష్టించింది. మొత్తానికి ఆత్మీయ సమ్మేళనం టీఆర్ఎస్‌లో కంగారు సృష్టించినా.. చివరకు కేసీఆర్ మార్గమే తన మార్గమంటూ తుమ్మల క్లారిటీ ఇవ్వడంతో అంతా సద్దుమణిగినట్లయ్యింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేసింది..