Kamareddy Politics: టికెట్ నాదే.. గెలుపు నాదే..! సీఎం పోటీ చేసినా నో ప్రాబ్లం అంటున్న కాంగ్రెస్ నేత.. కానీ ఫస్ట్ లిస్టులో పేరు లేకపోవడంతో..
Telangana Assembly Election 2023: ఆయన హస్తం పార్టీలో సీనియర్ నేత.. ఓటమి ఏదురైనా నియోజకవర్గాన్ని పట్టుకుని ఉన్న నేత.. దీంతో ఈ సారి అతని గెలుపు ఖాయం అని.. అనుకున్నారంతా.. సిట్టింగ్ మీద ఉన్నా వ్యతిరేకత.. ఆయనపై ఉన్న సానుభూతి.. ఇలా పక్కాగా.. కాంగ్రెస్ జెండా అక్కడ ఎగురుతుంది.. అంటూ అనున్నారు. కానీ కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్.. ప్రత్యర్థి పార్టీ అధినేతే అక్కడి నుంచి పోటిలో దిగడంతో అంతా అవాక్కాయ్యారు.. అయినప్పటికీ.. ఆయన పట్టువదలకుండా శ్రమిస్తున్నారు.. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి షబ్బీర్ అలీ..

Telangana Assembly Election 2023: ఆయన హస్తం పార్టీలో సీనియర్ నేత.. ఓటమి ఏదురైనా నియోజకవర్గాన్ని పట్టుకుని ఉన్న నేత.. దీంతో ఈ సారి అతని గెలుపు ఖాయం అని.. అనుకున్నారంతా.. సిట్టింగ్ మీద ఉన్నా వ్యతిరేకత.. ఆయనపై ఉన్న సానుభూతి.. ఇలా పక్కాగా.. కాంగ్రెస్ జెండా అక్కడ ఎగురుతుంది.. అంటూ అనున్నారు. కానీ కట్ చేస్తే.. ఊహించని ట్విస్ట్.. ప్రత్యర్థి పార్టీ అధినేతే అక్కడి నుంచి పోటిలో దిగడంతో అంతా అవాక్కాయ్యారు.. అయినప్పటికీ.. ఆయన పట్టువదలకుండా శ్రమిస్తున్నారు.. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. కామారెడ్డి.. ఇప్పుడు రాష్ట్రంలోనే హట్ సీట్.. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం.. దీనికి తోడు మంత్రి కేటీఆర్ ఇంచార్జ్ భాధ్యతలు తీసుకున్న నియోజకవర్గం.. దీంతో ఇప్పుడు అందరు నేతలు.. అన్నీ వ్యూహలు కామారెడ్డి చూట్టే తిరుగుతున్నాయి.. రాష్ట్రంలో అత్యధిక నిదులు కూడా కేటాయిస్తుండటంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అష్ట దిగ్బంధనం చేసినట్లయింది. అసలు బీఆర్ఎస్ ట్విస్ట్ ఇవ్వడంతో షాక్ అయిన షబ్బీర్ అలీ.. ఇప్పుడు మాత్రం పట్టు వదలడం లేదట… ప్రత్యర్థి సీఎం అయిన కూడా తగ్గేదే లే అంటున్నట్లు టాక్ వినిస్తోంది. దీంతో అటు బీఆర్ఎస్ కూడ స్పీడ్ పెంచుతూ కాంగ్రెస్ స్పీడ్‌కు కళ్లేం వేసే ప్రయత్నం చేస్తుందని సమాచారం..
పస్ట్ లిస్ట్‌లో పేరు లేకపోవడంతో కన్‌ఫ్యూజన్..
దాదాపు మూడు దశాబ్దదాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న షబ్బీర్ అలీ.. మంత్రిగా రెండు పర్యాయాలు పని చేసారు. ఇప్పుడు ప్రత్యర్థి సీఎం క్యాండిడెట్ కావడంతో కోంత కష్టకాలన్ని పేస్ చేస్తున్నారట.. బీఆర్ఎస్ నుంచి వచ్చే వలసలు ఆగిపోవడం.. డబ్బుల ప్రవాహం ఎక్కువవుతుండటంతో కోంత ఇబ్బందికర పరిస్థితి ఉందట.. అటు పార్టీ సైతం పస్ట్ లిస్ట్‌లో షబ్బీర్ అలీ పేరు ఇవ్వకపోవడంతో క్యాడర్ కూడా డైలామాలోకి వెళ్లిందట.. అసలు పస్ట్ లిస్ట్‌లో రాకపోవడానికి కారణం ఏంటీ..? కావాలనే ఆపుతున్నారా.? లేదా ఏదైన కారణం ఉందా..? అనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుందట.. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య గట్టి పోరే ఉండబోతుందట.. కేసిఆర్ పోటీ చేస్తుండటంతో ఇది ఆ పార్టీకి ప్రత్యేకం కానుంది.. ఇక అటు కాంగ్రెస్ దీన్ని ఛాలేంజింగ్‌గానే తీసుకుంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ షబ్బీర్ అలీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తామని అధినాయకత్వం కూడా హామీనిస్తుందట.. సీఎం వచ్చినా కూడా షబ్బీర్ అలీ తన స్పీడ్‌ను ఎక్కడ కూడా తగ్గించలేదు.. రోజు వారిగా పార్టీ జాయింనిగ్స్‌తో పాటు వరుసగా కార్యకర్తల సమావేశం నిర్వహిస్తూ దూసుకువేళుతున్నారు.
టికెట్ నాదే.. గెలుపు నాదే.. షబ్బీర్ అలీ..
ఇలాంటి పరిస్థితుల్లో.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ టీవీ9 ప్రత్యేకంగా మాట్లాడి.. అనేక విషయాలపై క్లారిటి ఇచ్చేసారు.. సెకండ్ లిస్ట్‌లో కొంత మంది సీనియర్ల పేర్లు ఉండాలి.. కావున ఆపారు అని చేబుతున్నారు.. టికేట్ విషయంలో అసలు టెన్షన్ లేదు.. ఇదే ధీమాను కార్యకర్తల దగ్గర కూడా చెబుతున్నాను.. నేను పోటి నుండి తప్పుకునే ప్రసక్తే లేదు.. అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.. ఇలా మొత్తానికి కామారెడ్డి రాజకీయం రసవత్తరంగా మారడంతో ఇప్పుడు ఈ సీట్ హాట్ సీట్ అయిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
