- Telugu News Telangana Telangana Elections 2023: Rahul and Priyanka Gandhi kick starts poll campaign after Ramappa temple visit in mulugu
రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న రాహుల్, ప్రియాంక.. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు శ్రీకారం చుట్టారు. ముందుగా వారిద్దరు 13వ శతాబ్ధానికి చెందిన రామప్ప ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు నుంచి పార్టీ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు.
Updated on: Oct 18, 2023 | 7:33 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు శ్రీకారం చుట్టారు. ముందుగా వారిద్దరు 13వ శతాబ్ధానికి చెందిన రామప్ప ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ములుగు నుంచి పార్టీ బస్సు యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడారు.

రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఫోటోలో స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు.

రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రియాంక గాంధీ

రామప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. వారిద్దరూ తెలంగాణలో మూడ్రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

రామప్ప ఆలయ దర్శనం తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. పక్కను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. రాహుల్, ప్రియాంక పర్యటన నేపథ్యంలో ములుగులో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు

రామప్ప ఆలయ దర్శనం తర్వాత కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఆ తర్వాత ములుగులో నిర్వహించిన సభకు జనం భారీ ఎత్తున తరలివచ్చారు