AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: కామారెడ్డి కాంగ్రెస్‌లో గందరగోళం.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న అసంతృప్త నేతలు

Telangana Election: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది పార్టీని వీడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Telangana Election: కామారెడ్డి కాంగ్రెస్‌లో గందరగోళం.. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న అసంతృప్త నేతలు
Subhash Reddy Revanth Reddy
Balaraju Goud
|

Updated on: Oct 29, 2023 | 8:57 AM

Share

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ.. కాంగ్రెస్‌లో రోజురోజుకూ రెబల్స్ బెడద ఎక్కువ అవుతోంది. టికెట్ దక్కని నేతల్లో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది పార్టీని వీడుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

టికెట్ దక్కకపోవడంతో బోరున విలపించిన ఎల్లారెడ్డి కాంగ్రెస్ కో ఆర్డినేటర్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. రెబల్‌గా పోటీ చేస్తానని ప్రకటించడమే కాకుండా.. తనను మోసం చేసిన రేవంత్‌ను సైతం ఓడిస్తానని శపథం చేశారాయన. ఎల్లారెడ్డిలో కె.మదన్‌ మోహన్‌రావుకు టికెట్ కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది సుభాష్‌రెడ్డి వర్గం.

ఇక జుక్కల్‌లో మాజీ ఎమ్మెల్యే గంగారాం తన అనుచరులతో ఇవాళ సమావేశం కాబోతున్నారు. జుక్కల్ టికెట్ పెండింగ్‌లో పెట్టడంపై ఆయన అసంతృప్తిలో ఉన్నారు. దీనిపై అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇక బాన్సువాడ టికెట్ కోసం రెండు వర్గాలు పోటీపడటంతో పెండింగ్‌లో పెట్టింది అధిష్టానం. దీంతో రెండు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుః కేటీఆర్

మరోవైపు అధికార పార్టీ బీఆర్ఎస్ అన్ని వర్గాలను కలుపుపోయే పనిలో పడింది. అసమ్మతి నేతలకు బుజ్జగింపులతో పాటు స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కే. తారక రామారావు. తననున కలిసిన కామారెడ్డి రైతు జేఏసీ బృందం కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనను వెంటనే రద్దు చేస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. ఇప్పటికే రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ని రద్దు చేస్తున్నట్లు గతంలోనే మున్సిపల్ శాఖ తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు కేటీఆర్.

మరోసారి డిటిసిపి అధికారులతో మాట్లాడిన కేటీఆర్.. ప్రస్తుతం అమలులో ఉన్న పాత మాస్టర్ ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చిన కేటీఆర్.. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రద్దుకు సంబంధించి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. కేటీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రైతు జేఏసీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే రైతు జేఏసీ నిరసన కార్యక్రమాల సందర్భంగా నమోదైన కేసులను కూడా సానుకూలంగా పరిశీలించి ఎత్తేసే చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…