Telangana Election: పసుపు జెండా లేకుండా తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు.. తెలుగు తమ్ముళ్లు ఎవరి వైపు..?
టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలుగుదేశం ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేయడం లేదు. దీంతో ఇక్కడ ఆ పార్టీ ఓటు బ్యాంకు కీలకం కానుంది. కాంగ్రెస్, బీఆర్ఎఎస్ నేతలు టీడీపీ ఓటు బ్యాంకు మద్దతు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ళను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజక వర్గం తెలుగుదేశం కంచుకోట.. టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు పోటీ చేస్తే.. ఆరు పర్యాయాలు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. నియోజక వర్గాల డీలిమిటేషన్ కంటే ముందు వరకు తుమ్మల నాగేశ్వరరావు ఆ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య మూడుసార్లు విజయం సాధించారు. గత 2018 ఎన్నికల్లో మహా కూటమి తరపున సండ్ర విజయం సాధించారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సండ్ర.
అయితే ఆసక్తికర మైన పరిణామం ఏంటంటే, టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి తెలుగుదేశం ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేయడం లేదు. దీంతో ఇక్కడ ఆ పార్టీ ఓటు బ్యాంకు కీలకం కానుంది. కాంగ్రెస్, బీఆర్ఎఎస్ నేతలు టీడీపీ ఓటు బ్యాంకు మద్దతు కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ళను తమ వైపు తిప్పుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి కంచుకోట. తొమ్మిది సార్లు పోటీ చేస్తే, ఆరు సార్లు తెలుగు దేశం జెండా ఎగిరింది.1985,1989,1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. సత్తుపల్లి నియోజక వర్గంలో అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకుని, పార్టీని బలోపేతం చేసి కంచుకోటగా మార్చారు తుమ్మల. ఆ తర్వాత సత్తుపల్లి నియోజక వర్గాల డీలిమిటేషన్ లో భాగంగా ఎస్సీ రిజర్వుడు అయ్యింది. దీంతో తుమ్మల ఖమ్మం నియోజక వర్గం నుండి పోటీ చేయాల్సి వచ్చింది.
ఈసారి ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత మొదటిసారి సత్తుపల్లి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్ధి పోటీలో ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కూడా 2018 లో సత్తుపల్లిలో మహాకూటమి తరుపున టీడీపీ అభ్యర్ధి పోటీ చేశారు. 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా తొమ్మిది పర్యాయాలు టీడీపీ అభ్యర్దులు పోటీ ఉండి ఆరు పర్యాయాలు పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. గత అన్ని ఎన్నికల్లో పలు స్థానాల్లో వామపక్షాలతో సీట్లు సర్దుబాట్లు గత ఎన్నికల్లో మహా కూటమితో పొత్తు తదితర కారణాలవల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొన్ని స్థానాల్లో పలు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా సత్తుపల్లి నియోజకవర్గంలో మాత్రం ప్రతి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోటీ చేశారు
ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకూడదని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించడంతో సత్తుపల్లి నియోజకవర్గం మొదటిసారి టీడీపీ అభ్యర్థి లేకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. గత 2018 ఎన్నికల్లో మహా కూటమి తరపున.. తెలుగుదేశం అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా.. బీఆర్‌ఎస్‌లో చేరడంతో.. సత్తుపల్లి నియోజక వర్గ సమీకరణాలు మారాయి. ప్రస్తుతం టీడీపీ పోటీలో లేకపోవడంతో, ఆ పార్టీ ఓటు బ్యాంకు కీలకంగా మారింది. వారి మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో, ఆయన అరెస్ట్‌ను ముక్తకంఠంతో ఖండించింది సత్తుపల్లి నియోజకవర్గం. పెద్ద ఎత్తున చంద్రబాబుకు సంఘీభావ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో అన్ని పార్టీలు పాల్గొన్నారు. తెలుగుదేశం అభ్యర్థి పోటీలో లేకుండా తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో. సత్తుపల్లిలో ఎవరు విజయం సాధిస్తారు. ఏ జెండా ఎగురుతుందన్నదీ ఆసక్తికరంగా మారింది. చూడాలి మరీ పసుపు తమ్ముళ్ళు ఎవరి వైపు నిలుస్తారన్నదీ.!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…