- Telugu News Photo Gallery Cyclone Alert: Heavy Rainfall To These Places In Andhra Pradesh, Telangana And Tamilnadu, Know the detail
AP Rains: వాయుగుండం అలెర్ట్.! ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు.. ఆ జిల్లాలకు..
ఈ అల్పపీడనం కారణంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉరుములు, మెరుపులు సంభవించి, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇవాళ, రేపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
Updated on: Nov 15, 2023 | 9:30 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. అండమాన్ నికోబార్ దీవుల దగ్గర కేంద్రీకృతమై ఉంది. ఆ అల్పపీడనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

ఈ ప్రభావంతో బుధవారం, గురువారం రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నేడు ఉత్తర కోస్తాలో అనేక చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.

ఉరుములు, మెరుపులు సంభవించి, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇవాళ, రేపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

అలాగే ఈ అల్పపీడనం కారణంగా ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే కాకుండా తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అన్నారు.

మరోవైపు తమిళనాడులోని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడులోని కొన్ని జిల్లాలో భారీ వర్షలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారి చేసింది. వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.





























