- Telugu News Photo Gallery Cricket photos ICC ODI World Cup 2023: India Vs New Zealand 1st Semifinal, Wankhede Stadium Mumbai, Know Teams Here
IND Vs NZ: సెమీఫైనల్ ఫీవర్: టీమిండియా ఆ ఒక్క తప్పు చేయకూడదు.. లేదంటే కధ కంచికే.!
వన్డే వరల్డ్‌కప్ 2011 సెమీఫైనల్‌లో టీమిండియా గెలిస్తే.. ఆ తర్వాత్ 2015, 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. గత రెండు వన్డే ప్రపంచకప్‌లలోనూ టీమిండియా లీగ్ స్టేజిలో అగ్రస్థానంలో నిలవగా.. సెమీస్‌కు వచ్చేసరికి ఘోరంగా చేతులెత్తేసి.. ఫ్యాన్స్ ఆశలు అడియాశలు చేసింది. అదే రిపీట్ అయితే.. ఈసారి కూడా కథ కంచికే అంటున్నారు కొందరు ఫ్యాన్స్..
Updated on: Nov 15, 2023 | 9:12 AM

వన్డే వరల్డ్‌కప్ చివరి అంకానికి చేరుకుంది. గ్రూప్ స్టేజిలో భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు టాప్ 4లో నిలిచాయి. ఈ క్రమంలోనే మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో బుధవారం ముంబై వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ కోసం యావత్ దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

లీగ్ స్టేజిలో ఓటమే ఎరుగని భారత జట్టు ఇవాళ కూడా గెలిచి.. వరల్డ్‌కప్ ఫైనల్ చేరాలని కోట్లాది మంది ఆశిస్తున్నారు. అలాగే 2019 వరల్డ్‌కప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన ఆసన్నమైందని ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా వీడియోలు క్రియేట్ చేస్తున్నారు.

అయితే మరికొందరు టీమిండియా మళ్లీ ఆ తప్పే రిపీట్ చేస్తే.. ఈసారి కూడా కథ కంచికేనంటూ టెన్షన్ పడుతున్నారు. గత వరల్డ్‌కప్ సెమీస్‌లతో పోలిస్తే.. టీమిండియా ట్రాక్ రికార్డు చూస్తే అస్సలు బాగోలేదు. గడిచిన 7 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో టీమిండియా కేవలం మూడింటిలో మాత్రమే గెలిచింది.

వన్డే వరల్డ్‌కప్ 2011 సెమీఫైనల్‌లో టీమిండియా గెలిస్తే.. ఆ తర్వాత్ 2015, 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో టీమిండియా ఘోర ఓటమిపాలైంది. గత రెండు వన్డే ప్రపంచకప్‌లలోనూ టీమిండియా లీగ్ స్టేజిలో అగ్రస్థానంలో నిలవగా.. సెమీస్‌కు వచ్చేసరికి ఘోరంగా చేతులెత్తేసి.. ఫ్యాన్స్ ఆశలు అడియాశలు చేసింది. ఈసారి అలా జరగకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

భారత్, న్యూజిలాండ్ జట్లు ఇలా ఉన్నాయి: టీమ్ ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా , మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రీసద్ధ్ కృష్ణ. న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్మీ, విల్ సౌత్ యంగ్.





























