తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల కోసం ఈ ఏడాది జరిగే ఎంసెట్ పరీక్ష తేదిల్లో మార్పులు చేసినట్లుగా అధికారులు ధ్రువీకరించారు. ముందుగా తెలిపినట్లు మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసి.. మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నారు. అయితే మే 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష యథాతథంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. నీట్, టీఎస్‌పీఎస్సీ పరీక్షల కారణంగానే ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు వారు పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు తేది మరో 3 రోజులలో అంటే.. ఏప్రిల్ 4తో ముగియనుంది. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ 30 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఇక గురువారం నాటి వరకు తెలంగాణ ఎంసెట్‌కు 1,14,989 మంది దరఖాస్తు చేసుకోగా, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్‌కు 65,033 మంది దరఖాస్తు చేసుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..