Huzurabad ByPoll Result: వ్యక్తుల గెలుపే తప్ప పార్టీలవి కాదు.. హుజూరాబాద్ బైపోల్స్‌పై టీ.కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
Huzurabad By Election Result: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ముగిసిన నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపులో..
Huzurabad By Poll: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ముగిసిన నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపులో.. అన్ని రౌండ్లలోనూ ఈటల రాజేందర్ పైచేయి సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. అటు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ కనీస పోటీ కూడా ఇవ్వలేక ఢీలాపడ్డారు. హుజూరాబాద్ బైపోల్ ఓట్ల లెక్కింపు సరళిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో ఎవరు గెలిచినా.. వ్యక్తుల గెలుపే తప్ప పార్టీల గెలుపు కాదన్నారు. హుజూరాబాద్‌లో ఎన్నికలు ఎలా జరిగిందన్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ డైరెక్టర్ల మధ్య జరిగిన ఎన్నికగానే పరిగణిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
డబ్బు ప్రభావం ఎక్కువగా ఉన్నందున హుజూరాబాద్ ఉప ఎన్నికను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందే కోరిందని మహేష్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు. దీనిపై ఎన్నికలకు నాలుగు రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిందని చెప్పుకొచ్చారు. పోలింగ్ నాడు కూడా టీఆర్ఎస్, బీజేపీలు భారీగా డబ్బులు పంపిణీ చేశాయని ఆరోపించారు. ఎన్నికల బరిలో నిలవడం ద్వారా హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని వ్యాఖ్యానించారు.
Also Read..
Badvel By Election Results 2021: బద్వేలులో తిరుగులేని వైసీపీ.. ఏడు రౌండ్లకే 60 వేల భారీ మెజారిటీ
Huzurabad By Election Result: హుజురాబాద్‌లో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రజా ఏక్తా పార్టీ షాక్..
Festival Season Effect: అక్టోబర్‌లో ఫాస్టాగ్ వసూళ్లు ఎంత పెరిగాయంటే..