AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR – Munugode Survey: మునుగోడుపై కేసీఆర్ సర్వేలో సంచలనాలు.. గెలుపెవరిదంటే..!

Kcr - Munugode Survey: సర్వే రిపోర్ట్‌తో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో జోష్‌ నింపారు సీఎం కేసీఆర్‌. మునుగోడులో గెలిచేది మనమేనని టీఆర్ఎస్ నేతలకు తెలిపారు గులాబీ దళపతి.

CM KCR - Munugode Survey: మునుగోడుపై కేసీఆర్ సర్వేలో సంచలనాలు.. గెలుపెవరిదంటే..!
Kcr
Shiva Prajapati
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Sep 04, 2022 | 8:47 AM

Share

CM KCR – Munugode Survey: సర్వే రిపోర్ట్‌తో టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో జోష్‌ నింపారు సీఎం కేసీఆర్‌. మునుగోడులో గెలిచేది మనమేనని టీఆర్ఎస్ నేతలకు తెలిపారు గులాబీ దళపతి. ఇక బీజేపీకి మూడో స్థానం వస్తుందని, కాంగ్రెస్‌ రెండో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్‌పి మీటింగ్‌లో మునుగోడు ఎన్నికలపై ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు కేసీఆర్‌. ఈ సందర్భంగా మునుగోడు ఉపఎన్నికపై చేపించిన సర్వే రిపోర్ట్‌ను వెల్లడించారు సీఎం. టీఆర్‌ఎస్‌కే 41% ఓట్లు పడతాయన్నారు కేసీఆర్‌. ఎమ్మెల్యేలను ఇంఛార్జ్‌లుగా పంపిస్తామని, ఒక్కో ఎమ్మెల్యేకు రెండు గ్రామాలకు చొప్పున బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. బీజేపీ బెదిరింపులను పట్టించుకోవద్దని సూచించారు సీఎం. బీజేపీ నేతలు అరిచి గీ పెట్టిన గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

సీబీఐ, ఈడీలని కేంద్రం మిస్ యూస్ చేస్తోందన్నారు కేసీఆర్‌. తెలంగాణ లో బీజేపీ మనల్ని ఏం చెయ్యలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు బీజేపీ ఇక్కడ చేస్తే నడవడదన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే 72 నుండి 80 సీట్లు టిఆర్ఎస్‌కు వస్తాయని ఎమ్మెల్యేలకు తెలిపారు కేసీఆర్‌. ఎమ్మెల్యేలు ఓపికగా ఉండి పనిచేసుకోవాలన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు ఇస్తామన్నారు. శివసేన ను టార్గెట్ చేసినట్టు తెలంగాణలో టిఆర్‌ఎస్ ను టార్గెట్ చేయాలని చూస్తున్నారని, బీజేపీకి భయపడేది లేదన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..