CM Revanth: ‘ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..’ అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..

రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశాల్లో పర్యటిస్తోంది. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటించబోతోంది. ఈ పర్యటనలో పలు కంపెనీలతో..

CM Revanth: 'ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ..' అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ..
Cm Revanth Reddy
Follow us

|

Updated on: Aug 05, 2024 | 6:47 AM

రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి బృందం విదేశాల్లో పర్యటిస్తోంది. ఎనిమిది రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ పర్యటించబోతోంది. ఈ పర్యటనలో పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. ఇందులో భాగంగా ఇవాళ న్యూయార్క్‌లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు.

తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు, వ్యూహత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. న్యూజెర్సీలో NRI సెల్‌ టీపీసీసీ ఆధ్వర్యంలో షెరటాన్‌ హోటల్‌ నుంచి రాయల్‌ ఆల్బర్ట్‌ ప్యాలెస్‌ వరకు జరిగిన భారీ కార్‌ ర్యాలీలో పాల్గొన్నారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరై.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎన్‌ఆర్‌ఐలను కోరారు. పెట్టుబడుదారులకు ప్రభుత్వం తరుఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామమన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో త్వరలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు రేవంత్‌రెడ్డి. ఇందులో ఐటీ, వైద్య, క్రీడా రంగాలతోపాటు పలు అంశాలపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆనంద్ మహీంద్రాతో ఈ అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్‌ ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు రేవంత్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. ఎన్ఆర్‌ఐల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం… 90 రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని తెలిపారు. మరో 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు.

ఈసారి అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించి… ప్రజా సమస్యలపై చర్చించామన్నారు రేవంత్‌రెడ్డి. ఈ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకుండా బీఆర్‌ఎస్‌ తప్పించుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. 11రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్‌ను సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది. ఆగస్టు 14 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ నెల తొమ్మిది వరకు న్యూయార్క్, వాషింగ్టన్, డల్లాస్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. ఈ నెల 5న న్యూయార్క్‌లోని కాగ్నిజెంట్, ఆర్సీఎం, టిబిసి, కార్నింగ్, జోయిటస్ సహా పలు సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. 6న పెప్సికో, హెచ్‌సిఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తరువాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళతారు. వాషింగ్టన్‌లో ఐటీ సేవల సంస్థలు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమవుతారు.

అనంతరం డల్లాస్‌కు వెళ్తారు. ఈ నెల 7న ఛార్లెస్ స్క్వాబ్ హెడ్, మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శిస్తారు. 8న కాలిఫోర్నియాలో ట్రినెట్ సీఈఓ, ఆరమ్, ఆమ్జెన్, రెనెసాస్, అమాట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. ఈ నెల 9న గూగుల్ సీనియర్ ప్రతినిధులతో రేవంత్ భేటీ ఉండనుంది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియా సియోల్‌కు చేరుకుంటారు. 12న సియోల్‌లో యూయూ ఫార్మా, కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ, ఎల్‌ఎస్ హోల్డింగ్స్, హ్యుందాయ్ మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు. 13న హాన్ రివర్ ప్రాజెక్టుపై డిప్యూటీ మేయర్ జూ యంగ్ టాయ్తోతో సీఎం భేటీ ఉంటుంది. 14న రేవంత్ బృందం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతుంది. ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్‌రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి.

ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ.. అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ
ప్రపంచంతోనే తెలంగాణకు పోటీ.. అమెరికాలో సీఎం రేవంత్ టీమ్ బిజీబిజీ
లక్ష్మీ ప్రదమైన శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం విశిష్టత ఏమిటంటే
లక్ష్మీ ప్రదమైన శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం విశిష్టత ఏమిటంటే
SSC కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్
SSC కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేటర్స్ ఎగ్జామినేషన్ 2024 నోటిఫికేషన్
మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తాజా రేట్లు వివరాలు
మహిళలకు శుభవార్త.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. తాజా రేట్లు వివరాలు
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..
అర్ధరాత్రి నలుగురు సజీవ సమాధి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..
అర్ధరాత్రి నలుగురు సజీవ సమాధి.. ఏం జరిగిందంటే.! వీడియో వైరల్..
మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది.! 80 లక్షలు..
మట్టిలో దొరికిన వజ్రం ఆ కూలీ జీవితాన్నే మార్చేసింది.! 80 లక్షలు..
చాదర్‌ఘాట్‌ బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం
చాదర్‌ఘాట్‌ బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం
తగ్గాననుకున్నారా లే మళ్లీ పెరిగినా! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు.
తగ్గాననుకున్నారా లే మళ్లీ పెరిగినా! 33 గేట్లు ఎత్తి దిగువకు నీరు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు.! చూసేందుకు అద్భుతంగా జల దృశ్యాలు.
శ్రీశైలం ప్రాజెక్ట్ కు సవాళ్లు.! చూసేందుకు అద్భుతంగా జల దృశ్యాలు.