Telangana: కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల తెలంగాణకు తీరని నష్టం.. సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు..

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఏమాత్రం సహకారం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం..

Telangana: కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల తెలంగాణకు తీరని నష్టం.. సీఎం కేసీఆర్ సంచలన ఆరోపణలు..
Telangana Cm Kcr
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 04, 2022 | 5:09 PM

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఏమాత్రం సహకారం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అసమర్థ విధానాల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు. దాదాపు 3 లక్షల కోట్లు తెలంగాణ నష్టపోయిందన్నారు. ఆదివారం నాడు మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బహరింగసభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. 8 ఏళ్లు అవుతున్నా కృష్ణా జలాల్లో నీటి వాటాలు తేల్చడం లేదన్నారు.

వాళ్లు చేయ్యరు, చేసేవాళ్లను చెయ్యనివ్వరు అని కేంద్ర ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రానికి పైన పటారం లోన లొటారం విధానం అని ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను వారు పని చేయనీయరు అని తీవ్ర ఆరోపణలు చేశారు. కాళ్లలో కట్టెలు పెడుతాం అన్నట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాలతో సమానంగా కేంద్రం పని చేస్తేనే దేశం అభివృద్ధి చేస్తుంది. రాష్ట్రానికి వచ్చి ప్రధాని మోదీ డంబాచారాలు చెబుతారు కానీ, తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. దేశంలో ఏం జరుగుతుందో మేధావులు, యువత ఆలోచించాలి. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా కరెంట్ సరిగా ఉండదు. తాగు, సాగు నీరే ఉండదన్నారు.

మహబూబ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ ప్రసంగం లైవ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..