సచివాలయ తుది డిజైన్‌పై ఆర్‌ అండ్ బీ అధికారులతో కేసీఆర్ కీలక భేటీ..

ప్రగతి భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ అండ్ బీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పాత సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంపై అధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. నూతన సచివాలయ డిజైన్‌లను..

  • Tv9 Telugu
  • Publish Date - 7:42 am, Tue, 21 July 20
సచివాలయ తుది డిజైన్‌పై ఆర్‌ అండ్ బీ అధికారులతో కేసీఆర్ కీలక భేటీ..

ప్రగతి భవన్‌లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఆర్ అండ్ బీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. పాత సచివాలయం కూల్చివేత, నూతన సచివాలయం నిర్మాణంపై అధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. నూతన సచివాలయ డిజైన్‌లను మరోమారు పరిశీలించి, పలు మార్పులు చేర్పులు చేసి తుది డిజైన్‌లను కేసీఆర్ ఫైనల్ చేయబోతున్నారు. అలాగే కొత్తగా నిర్మించే సచివాలయంలో ఉండాల్సిన సౌకర్యాలు సహా ఇతర అంశాలపై పూర్థి స్థాయిలో చర్చించబోతున్నారు. ఆస్కార్, పొన్ని రూపొందించిన నమూనాల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసే అవకావం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ సమావేశానికి చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లు హాజరవుతున్నారు. కాగా నమూనాలు ఖరారు చేసిన అనంతరం మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుని టెండర్లు పలిచి, భవన సముదాయ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఇక ఇదే సమావేశంలో ఉస్మానియా ఆసుపత్రి ఓల్డ్ బిల్డింగ్‌పై కూడా ఆర్ అండ్ బీ అధికారులతో చర్చించనున్నారు సీఎం. 2015లోనే ఉస్మానియా ఆసుపత్రి పాత బిల్డింగ్ కూల్చి.. అదే స్థానంలో కొత్తది కట్టాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం.

Read More: 

సీఎం కేసీఆర్‌ని పెళ్లికి ఇన్వైట్ చేసిన హీరో నితిన్..

ఏపీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారు.. మంత్రులెవరంటే?