Munugode Bypoll: టీవీల్లో వచ్చింది కొంచమే.. రాబోయే రోజుల్లో ఢిల్లీ పీఠం షేక్ అవడం ఖాయం.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
మునుగోడు ఉపఎన్నిక వేళ చండూరు బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రమాణం సవాల్‌పై సెటైర్ వేశారు. చిల్లర రాజకీయాలు అంటూ కొట్టిపారేశారు.

మునుగోడు ఉపఎన్నిక వేళ చండూరు బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రమాణం సవాల్‌పై సెటైర్ వేశారు. చిల్లర రాజకీయాలు అంటూ కొట్టిపారేశారు. ‘ఒకడొచ్చి తడిబట్టలతో ప్రమాణం చేస్తవా.. ఇంకొడొచ్చి పొడిబట్టలతో ప్రమాణం చేస్తవా.. గిదా రాజకీయం. అడ్డంగా దొరికిపోయిన దొంగలు జైల్లో ఉన్నారు. రాజ్యాంగ బద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నందున నేను సరిగా మాట్లాడటం లేదు. కేసు న్యాయస్థానంలో ఉంది. రేపో మాపో ఈ విషయం తేలుద్ది. నేను మాట్లాడితే దానిని ప్రభావితం చేస్తున్నాని అంటారు. అందుకే దానిపై ఎక్కువగా మాట్లాడను. నిన్న మొన్న టీవీల్లో వచ్చిన మ్యాటర్ కొంచమే. దొరికిన దొంగతనం చాలా పెద్దగా ఉంది. ఎన్నికల తరువాత ఢిల్లీ పీఠమే దుమ్ము రేగిపోయే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో అవన్నీ బయటపడుతాయి. ఈ దుర్మార్గులను కూకటివేళ్లతో పీకేసి.. బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు. ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు. ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఇష్టా రాజ్యంగా కూలగొట్టే దుర్మార్గులను తరిమేయకపోతే దేశం బాగుపడదు. పోరాటాల గడ్డను ఆగం చేద్దామని, చైతన్యమున్న నేలపైకి వచ్చి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా రుద్దబడిన మునుగోడు ఎన్నిక వాళ్లకు చెంపపెట్టు కావాలి, కనువిప్పు కావాలి. మనుగోడు ప్రజలు తమ ఓటుతో వారికి గట్టి బుద్ధి చెప్పాలి.’ అని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.
చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ స్పీచ్..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
