Cabinet Ministers: కొత్త సర్కార్‌లో కొలువుదీరి.. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మంత్రులు
నాలుగు సార్లు మంత్రులు, నలుగురు ముఖ్యమంత్రుల కింద పని, అపార అనుభవం, ఆ ఇద్దరి సొంతం. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకున్న తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ట్రాక్ రికార్డే వేరు. మిగిలిన మంత్రుల కన్నా భిన్నంగా వారి ప్రయాణం సాగింది. వాళ్లిద్దరూ.. ఎమ్మెల్యేగా కన్నా మంత్రులుగానే ఎక్కువ రోజులు పనిచేయడం రేవంత్‌రెడ్డి పాలనకు కలిసొచ్చే అంశం.
నాలుగు సార్లు మంత్రులు, నలుగురు ముఖ్యమంత్రుల కింద పని, అపార అనుభవం, ఆ ఇద్దరి సొంతం. రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకున్న తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ట్రాక్ రికార్డే వేరు. మిగిలిన మంత్రుల కన్నా భిన్నంగా వారి ప్రయాణం సాగింది. వాళ్లిద్దరూ.. ఎమ్మెల్యేగా కన్నా మంత్రులుగానే ఎక్కువ రోజులు పనిచేయడం రేవంత్‌రెడ్డి పాలనకు కలిసొచ్చే అంశం.
మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రి జూపల్లి కృష్ణానరావు. ఈ ఇద్దరు ఎంతో అదృష్టవంతులు. తెలంగాణ కొత్త ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి.. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. మొత్తం నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర ఈ ఇద్దరు మంత్రులుగా చేశారు. తుమ్మల నాగేశ్వరరావు.. తెలంగాణలో మోస్ట్ సీనియర్ పొలిటీషియన్లలో ఒకరుగా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి కీలక నేత. కమ్మ సామాజికవర్గానికి చెందిన తుమ్మల అన్న ఎన్టీఆర్ దగ్గర రాజకీయ ఓనమాలు దిద్దారు. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.
1985లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు యువ ఎమ్మెల్యేగా ఉన్న తుమ్మలకు ఎన్టీఆర్ కేబినెట్‌లో అవకాశం దక్కింది. అప్పుడు ఆయనకు మైనర్ ఇరిగేషన్ పోర్ట్‌ఫోలియో వరించింది. 1995లో మరోసారి అధికారంలోకి రావడంతో, ఆయనకు మళ్లీ అదే శాఖ కేటాయించారు సీఎం ఎన్టీఆర్. 1996లో చంద్రబాబు హయాంలో మరోసారి మంత్రి పదవిని చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు.. ఎక్సైజ్ శాఖను చేపట్టారు. అంతేకాదు, అదే ఏడాది కేంద్ర మంత్రిగానూ పదవిని చేపట్టారు తుమ్మల.
ఇక, 1999లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతో, మళ్లీ మంత్రి పదవిని చేపట్టారు. అప్పుడు రోడ్లు భవనాల శాఖను సమర్ధవంతంగా నిర్వహించారు తుమ్మల. ఇక 2014లో అప్పటి టీఆర్‌ఎస్‌లో చేరిన తుమ్మల.. 2015లో ఎమ్మెల్సీ హోదాలో కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 2016 ఉప ఎన్నికలో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018వరకు టీఆర్‌ఎస్‌లో మంత్రిగా కొనసాగారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల.. ఖమ్మం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో.. ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్ తర్వాత నాలుగో సీఎం హయాంలో మంత్రి పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు.
ఇక, జూపల్లి కృష్ణారావు కూడా దాదాపు ఇదే రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తుమ్మల నాగేశ్వరరావు, టీడీపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు మారితే.. జూపల్లి కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌కు వెళ్లి.. మళ్లీ కాంగ్రెస్‌కు వచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న జూపల్లి కృష్ణారావు 1999 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. 2014 వరకు ఆయన ఓటమి ఎరుగను నాయకుడిగా ఉన్నారు. దీంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. వైఎస్ కేబినెట్‌లో సివిల్ సప్లైస్ మినిస్టర్‌గా పనిచేసిన జూపల్లి, కిరణ్ కుమార్ కేబినెట్‌లో దేవాదాయ శాఖను చూశారు. కొల్లాపూర్ నుంచి ఐదు సార్లు వరుసగా గెలిచిన జూపల్లి కృష్ణారావు 2011లో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో గెలిచి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో పంచాయతీరాజ్ శాఖను చేపట్టారు. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రుల కేబినెట్‌లో పనిచేసిన కృష్ణారావు, ఇప్పుడు రేవంత్ మంత్రివర్గంలోనూ చోటు దక్కించుకున్నారు.
ఈ ఇద్దరు మంత్రులు నలుగురు సీఎంల కింద పనిచేసిన వారిగా రికార్డు సృష్టిస్తే.. దామోదర, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముగ్గురు సీఎంల టీమ్ చోటు సంపాదించారు. ఇక ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కొండా సురేఖ రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సీతక్క, పొన్నం, పొంగులేటి తొలిసారి మంత్రులు అయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…