తొలిసారిగా ప్రజాభవన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ

తొలిసారిగా ప్రజాభవన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ

Ram Naramaneni

|

Updated on: Dec 08, 2023 | 12:41 PM

ఇకపై ప్రగతి భవన్ కాకుండా, జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చుతున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు .. ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఆహ్వానించారు సీఎం రేవంత్. దీంతో నేడు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ప్రజాభవన్‌ వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లో ప్రజల అర్జీల వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత క్యూలైన్లలో వారిని లోపలికి పంపారు.

రేవంత్ రెడ్డి సీఎంగా పాలనా పగ్గాలు చేపడుతూనే కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ ముందు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తొలగించాలని ఆదేశించారు. స్వయంగా ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం, అదే వేదికపై నుంచే ప్రగతి భవన్ కంచె తొలగిస్తున్నట్లు ప్రకటించారు రేవంత్. ఒకవైపు రేవంత్ ప్రమాణం, మరోవైపు ముఖ్యమంత్రి అధికారిక నివాసం ముందు కంచె తొలగింపు ఒకేసారి జరిగాయి.

గ్యాస్ కట్టర్లతో ఇనుప గ్రిల్స్‌ను కత్తిరించి, తొలగించారు. దీంతో ఇక్కడ రోడ్డు వెడల్పుఅయింది. ఇకపై ప్రగతి భవన్ కాకుండా, జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చుతున్నట్లు రేవంత్ ప్రకటించారు. ఇకపై ప్రజా భవన్‌కు ఎవరైనా రావొచ్చు .. ఎలాంటి ఆంక్షలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఆహ్వానించిన సీఎం రేవంత్.. దీనిని ప్రజలు పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని కోరారు.  చెప్పినట్లుగానే ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై వినతులు స్వీకరించారు. వారి సమస్యలను రేవంత్‌ సావధానంగా విన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

 

Published on: Dec 08, 2023 10:31 AM