Telangana Budget: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ స్పీచ్‌పైనే సర్వత్రా ఉత్కంఠ..!

మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయ్‌. బడ్జెట్‌ సమరానికి అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి అధికార, విపక్షాలు. అయితే, అన్నింటి కంటే గవర్నర్‌ ప్రసంగంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Telangana Budget: నేటి నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. గవర్నర్ స్పీచ్‌పైనే సర్వత్రా ఉత్కంఠ..!
Telangana Assembly
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 03, 2023 | 6:55 AM

మరికొద్ది గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయ్‌. బడ్జెట్‌ సమరానికి అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి అధికార, విపక్షాలు. అయితే, అన్నింటి కంటే గవర్నర్‌ ప్రసంగంపై ఉత్కంఠ కొనసాగుతోంది. గవర్నర్‌ స్పీచ్‌ ఎలా ఉండబోతోంది?. ఏమైనా సంచలనాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. ఇక, బడ్జెట్‌ ఎప్పుడు ప్రవేశపెడతారో? ఎన్ని లక్షల కోట్లో? ఏఏ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారో ఇప్పుడు చూద్దాం.

గవర్నర్‌ స్పీచ్‌లో సంచలనాలు ఉంటాయా?

మధ్యాహ్నం 12గంటల 10నిమిషాలకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయ్‌. అసెంబ్లీ సెషన్స్‌ మొదలుకాగానే, ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు గవర్నర్‌ తమిళిసై. ఆ తర్వాత BAC సమావేశం నిర్వహించి, బడ్జెట్ సెషన్స్‌ ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై నిర్ణయం తీసుకుంటారు. అనంతరం, గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించనున్నారు.

గతేడాది గవర్నర్‌ స్పీచ్‌ను స్కిప్‌ చేసిన ప్రభుత్వం, ఈసారి తప్పనిసరి పరిస్థితుల్లో గవర్నర్‌ ప్రసంగాన్ని ఇన్‌క్లూడ్‌ చేసింది. దాంతో, గవర్నర్‌ స్పీచ్‌లో సంచలనాలు ఏమైనా ఉంటాయా?. అసలు, గవర్నర్‌ ప్రసంగం ఎలా ఉండబోతోందనే ఆసక్తి మొదలైంది.

ఇవి కూడా చదవండి

ఇక, ఫిబ్రవరి 6న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఆరున ఉదయం 11గంటలకు శాసనసభలో ఆర్ధికమంత్రి హరీష్‌రావు, శాసనమండలిలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే, ఈసారి బడ్జెట్‌ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చు? ఎలక్షన్‌ ఇయర్‌ కావడంతో ఏఏ రంగాలకు ప్రాధాన్యత ఉండబోతోంది?. సంక్షేమానికి పెద్దపీట వేస్తారా? ఇలాంటివన్నీ ఇంట్రస్ట్‌ రేపుతున్నాయ్‌.

తెలంగాణ బడ్జెట్‌ ఈసారి 3 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో సంక్షేమ పథకాలకు అత్యంత ప్రాధాన్యత ఉండొచ్చని తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు