Bhadrachalam: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ.. 10కి చేరిన సంతానం సంఖ్య
భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. దీంతో సదరు మహిళ ఇంట్లో సంతానం 10 మందికి చేరింది. వివరాల్లోకెళ్తే..

భద్రాచలం: భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. దీంతో సదరు మహిళ ఇంట్లో సంతానం 10 మందికి చేరింది. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బట్టిగూడెం గ్రామానికి చెందిన ఊకే పొజ్జా అనే మహిళకు పురటి నొప్పులు వచ్చాయి. దీంతో జులై 2న భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. ఈ మహిళ బుధవారం సాయంత్రం ముగ్గురు చిన్నారులకు జన్మనిచ్చింది. ఇద్దరు మగ, ఒక ఆడ శిశువులు జన్మించారు.
మగ శిశువులు వరుసగా 1.8 కిలోలు, 1.75 కిలోల బరువు ఉన్నారు. ఆడ శిశువు 1.5 కిలోల బరువు ఉంది. కాన్పు అనంతరం తల్లి, పుట్టిన శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా మహిళకు ఇది ఎనిమిదో కాన్పు కావడం విశేషం. తాజాగా కాన్పుతో సదరు మహిళకు మొత్తం పది మంది సంతానం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.