Bhadrachalam: క్రమంగా పెరుగుతోన్న గోదారి నీటి మట్టం.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక.. ముంపు గ్రామాల ప్రజల ఆందోళన
భద్రాచలం వద్ద గోదావరి కి భారీగా వరద నీరు చేరుతోంది.. దీంతో నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ప్రియాంక.
తెలుగు రాష్ట్రాలతో పాటు, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో వరద గుప్పిట్లో భద్రాచలం చిక్కుకుంది. మళ్ళీ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలని హెచ్చరించారు. గోదారికి వరద పెరుగుతున్న నేపథ్యంలో..ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అవును గోదావరమ్మ క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది.. భద్రాచలం వద్ద గోదావరి కి భారీగా వరద నీరు చేరుతోంది.. దీంతో నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. గోదావరి నుండి 9 లక్షల 32 వేల 228 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ ప్రియాంక. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రజలు ఇళ్ళ నుండి బయటకి రావొద్దని, అత్యవసర సేవలకు కంట్రోల్ రూము నంబర్లు కు కాల్ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. కరకట్ట స్లుయూజ్ నుంచి వరద నీరు వస్తోంది. అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్ లోకి వరద నీరు చేరి మునిగి పోయాయి. భారీ మోటార్లు ఏర్పాటు చేసి..నీటిని తోడుతున్నామని చెబుతున్నారు. అయితే అన్ని మోటార్లు సరిగా పని చేయడం లేదని..అధికారుల నిర్లక్ష్యముతో..వరద నీరు వస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంట గంటకు గోదావరి వరద పెరుగుతున్న నేపథ్యంలో వరద ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది జూలై లో వచ్చిన వరదలకు వంద గ్రామాలు ముంపు కి గురయ్యాయి. వేలాది మంది కట్టు బట్టలతో నిరాశ్రయిలయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..