AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బీసీ కమిషన్ కొత్త టీం రెడీ..! తుది దశకు చేరుకున్న కసరత్తు.. ఆమోదమే ఆలస్యం!

తెలంగాణలో బీసీ కమిసన్‌ కొత్త టీం రెడీ అయ్యింది..! కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇవాళో, రేపో ఫైనల్‌ లిస్టు రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైనల్‌ లిస్టును గవర్నర్‌కు పంపినట్లు తెలుస్తోంది.

Telangana: బీసీ కమిషన్ కొత్త టీం రెడీ..! తుది దశకు చేరుకున్న కసరత్తు.. ఆమోదమే ఆలస్యం!
Cm Revanth Reddy Bhatti Vikramarka
Balaraju Goud
|

Updated on: Sep 01, 2024 | 6:39 PM

Share

తెలంగాణలో బీసీ కమిసన్‌ కొత్త టీం రెడీ అయ్యింది..! కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇవాళో, రేపో ఫైనల్‌ లిస్టు రాజ్‌భవన్‌కు చేరుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫైనల్‌ లిస్టును గవర్నర్‌కు పంపినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా బీసీ కమిషన్‌కు పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. దీనిపై సుదీర్ఘ కసరత్తు చేసిన రేవంత్ రెడ్డి, ఫైనల్ లిస్ట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో కొత్త బీసీ కమిషన్ ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కసరత్తు తుది దశకు చేరినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో కొత్త కమిషన్ చైర్మన్, మెంబర్లను అపాయింట్‌ చేస్తూ రాజ్ భవన్ నుంచి గెజిట్ విడుదలయ్యే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిషన్‌కు కొన్ని రోజుల పాటు ఎక్స్‌టెన్షన్ ఇవ్వాలని వచ్చిన ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టారని తెలుస్తోంది. అయితే చైర్మన్, మెంబర్లుగా ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీ లీడర్లతో పాటు రిటైర్డ్ జడ్జీల పేర్లను కూడా పరిశీలించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో సీనియర్‌ బీసీ నేతలైన నిరంజన్‌, సీనియర్‌ పార్టీ నేత కుమారుడు, మెంబర్లుగా రిటైర్డ్‌ జడ్జీలు ఒకరిద్దరి పేర్లు బలంగా వినిపించాయి ఇక గతంలో బీసీ నేతలుగా పనిచేసి, ఇటీవలే ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన రాచాల యుగంధర్‌ గౌడ్‌ పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బీసీ కమిషన్ పదవీ కాలం ఆగస్ట్ 31తో ముగింది. ఈలోపే కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కొత్త కమిషన్‌కే బీసీ కుల గణన బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. అయితే ఎవరిని నియమించాలనే అంశంపై ఆయన తుది కసరత్తు చేసినట్టు చర్చ జరుగుతోంది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్టు టాక్ ఉంది. చైర్మన్, మెంబర్లుగా అపాయింట్ చేసే వ్యక్తుల పేర్లను సిఫారసు చేస్తూ ప్రభుత్వం రాజ్ భవన్ కు ఒకట రెండు రోజుల్లో లేఖను పంపే చాన్స్ ఉంది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదించి, కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ విడుదల చేసే అవకాశముంది.

బీసీ కమిషన్‌లో చైర్మన్, ముగ్గురు సభ్యులు ఉంటారు. హైకోర్టు జడ్జితో సమానమైన ప్రొటోకాల్, జీతభత్యాలు ఉండటంతో ఆ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీసీ లీడర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని లీడర్లు, పోటీ చేసి ఓడిపోయిన నాయకులు, పార్టీలోని వివిధ ఆర్గనైజేషన్‌లో పనిచేసిన లీడర్లు పదవులు దక్కింకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. అందులో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి, కాంగ్రెస్‌లో చురుగ్గా పనిచేస్తున్న యువనేత రాచాల యుగంధర్‌ గౌడ్‌ వైపు అధిష్ఠానం కాస్తా మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. తనకు ఆవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. మరికొందరు లీడర్లు నేరుగా అధిష్టానంలోని కొందరు పెద్దల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట. కొందరు లీడర్లు బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి తమకు బీసీ కమిషన్ లో చోటు కల్పించాలని వినతులు ఇచ్చినట్టు తెలిస్తోంది.

ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ పదవీ కాలాన్ని మరికొంత కాలం పొడిగించాలని కొందరు కాంగ్రెస్ లీడర్లు లాబీయింగ్ చేశారనే ప్రచారం ఉంది. సదరు లీడర్లు ప్రస్తుత చైర్మన్‌తోనే కుల గణన జరిపించాలని సీఎం రేవంత్ వద్ద ప్రస్తావించగా.. ఆయన తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీలో చాలామంది సీనియర్ బీసీ లీడర్లు ఉన్నారని, వారికి ఛాన్స్ ఇవ్వాలని క్లారిటీ ఇవ్వడంతో లాబీంగ్ చేస్తున్న లీడర్లు మరో మాట మాట్లాడకుండా వెనక్కి వచ్చినట్లు తెలిసింది..! చూడాలి మరీ గవర్నర్ ఆమోదం ఎవరికి లభిస్తుందో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..