Telangana Assembly: అసెంబ్లీని కుదిపేసిన కౌశిక్‌రెడ్డి వివాదం.. సభ నుంచి BRS ఎమ్మెల్యేలు సస్పెండ్!
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి తీవ్ర దుమారం రేపింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి 'గన్‌తో కాల్చి పడేస్తా'నని కౌశిక్ రెడ్డి బెదిరించారన్న ఆరోపణలు సభను కుదిపేశాయి. కాంగ్రెస్ బర్తరఫ్‌కు డిమాండ్ చేయగా, స్పీకర్ ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించారు. ఈ నేఫథ్యంలో సభలో నిరసనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

ఆదివారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా సాగాయి. సభలో పాలకవర్గం, వర్సెస్ ప్రతిపక్షం అన్నట్టు సభగా సాగింది. సభలో BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై దుమారం చెలరేగింది. కడియం మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి బెదిరించారని ఆరోపణలు చేసింది అధికార పక్షం. గన్‌తో కాల్చి పడేస్తానని కౌశిక్ చేయితో సైగలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీంతోకౌశిక్ రెడ్డిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కౌశిక్ రెడ్డిని మిగిలిన పదవీకాలం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వీడియో పరిశీలించి స్పీకర్ చర్యలు తీసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వివాదం తెలంగాణ అసెంబ్లీని కుదిపేంది. ఎమ్మెల్యే కడియంను ఉద్దేశించి గన్‌తో కాల్చి పడేస్తానని కౌశిక్ రెడ్డి చేత్తో సైగలు చేశారని అధికార పక్షం ఆరోపిచింది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. కౌశిక్ రెడ్డి వీడియో పరిశీలించి స్పీకర్ చర్యలు తీసుకోవాలని విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన స్పీకర్ ఎథిక్స్ కమిటీకి ఈ అంశాన్ని నివేదించారు.
ఇదే ఘటనపై అటు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. సభలో ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. కౌశిక్ వ్యవహారశైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయి అభిప్రాయపడ్డారు. కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సూమోటోగా విచారణకు స్వీకరించాలని అన్నారు. అయితే దీనిపై స్పందించిన స్పీకర్ సభలో ఆందోళన చేసిన బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈరోజు, రేపు BRS సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
