Telangana Assembly: రెండోరోజూ ఆరని జ్వాల.. రగిలించిందెవరు? చలి కాచుకుంటున్నదెవరు?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తాతా మధు, నవీన్‌రెడ్డి వ్యాఖ్యలతో మొదలైన వివాదం అరెస్టులు, సస్పెన్షన్లు, అసెంబ్లీ తీర్మానాలు, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద ఘర్షణల వరకు వెళ్లింది. మరోవైపు కేసీఆర్‌పై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరులో ఎవరిది పైచేయి? బీజేపీ మాత్రం ప్రజా సమస్యలపై చర్చకు డిమాండ్ చేస్తోంది.

తెలంగాణ పొలిటికల్ సైన్స్‌లో కొత్తకొత్త టాపిక్స్ వచ్చి చేరుతున్నాయి. ఎన్నికల సీజనైనా కాకపోయినా, ఓటుబ్యాంకులతో పనున్నా లేకపోయినా.. మైలైజ్ తగ్గకూడదన్న కాన్షియస్‌నెస్ ఐతే బాగా పెరిగింది. తిరుగులేని ఫైటింగ్ స్పిరిట్‌తో కొట్లాడుతున్నాయి మూడు పార్టీలు. సరిగ్గా మిడిల్ ఆఫ్ ది టర్మ్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, మూడోసారి అధికారాన్ని క్యాప్చర్ చేయాలన్న కసితో కారు పార్టీ.. పవర్లోకి రావాలని గంపెడాశలు పెట్టుకున్న కమలం పార్టీ.. మూడు క్యాంపులూ ఎప్పటికప్పుడు స్ట్రాటజీల్ని మార్చుకుని ఎటాకింగ్ మోడ్‌లోనే కంటిన్యూ ఔతున్నాయి. తాజా అసెంబ్లీ సమావేశాల్ని అందివచ్చిన అవకాశంగా తీసుకుని దూసుకుపోతున్నాయి. ఈ దూకుడు సినిమాలో ఎవరిది ముందంజ.. ఎవరిది వెనుకంజ..? అసెంబ్లీ సెషన్ రెండోరోజు స్కోర్‌బోర్డ్ ఎటువైపు మొగ్గుతోంది? తొలిరోజు శోకరసం… రౌద్ర రసం.. మోతాదుకు మించి.. అన్ని రసాల్నీ వీరోచితంగా ఒలికించి.. బిగ్‌బాస్ పెర్ఫామెన్సుల్ని మించి టాలెంట్ చూపిస్తున్నాయి మూడు పార్టీలు. ముఖ్యంగా రూలింగ్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మెయిన్ అపోజిషన్ కారు పార్టీ మధ్య అగ్గిపుల్లతో పన్లేకుండానే భగ్గుమంటోంది. రాష్ట్రమంతటా ఇదే భయానక దృశ్యం. అసెంబ్లీ సెషన్ తొలిరోజు సోమవారం. అనాలని అన్నారో.. లేక ఫ్రస్ట్రేషన్‌లో అన్నారో తెలీదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు గేటు బయట అన్న ఆ ఒక్క మాట పెద్దమంటనే రాజేసింది. డ్రస్ కోడ్ మార్చి నల్లచొక్కాలతో ప్రభుత్వాన్ని ఎండగడదామన్న బీఆర్ఎస్ స్ట్రాటజీ మొత్తాన్ని మలుపు తిప్పిందని, అటుతిరిగి ఇటుతిరిగి కాంగ్రెస్‌కు ఎడ్జ్ వచ్చేలా చేసిందని తాతా మధు ఎపిసోడ్‌ని మరో యాంగిల్‌లో కూడా...
