మానవత్వం మంట కలిసిన వేళ.. అందరూ ఉన్నా అనాథలా.. చావుబతుకుల మధ్య వృద్ధ మహిళ
ఆమె దీనస్థితిని చూసిన పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుటుంబ సభ్యులు ఆమెను ఇలా వదిలివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రమ్మను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత అధికారులు ముందుకు వచ్చి ఆమెకు తక్షణ సహాయం, సురక్షితమైన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చింతపల్లి గ్రామానికి చెందిన భద్రమ్మ అనే వృద్ధ మహిళ దీనస్థితి స్థానికులను కలచివేస్తోంది. కొడుకు, కూతురు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆమె అశ్వారావుపేట బస్టాండ్‌లో దిక్కుతోచని స్థితిలో జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. భద్రమ్మకు కొడుకు, కూతురు ఇద్దరూ ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు జరిగాయి. కొంతకాలం వరకు ఆమె బాగోగులు చూసుకున్న కుటుంబ సభ్యులు.. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పట్టించుకోవడం మానేశారని స్థానికులు చెబుతున్నారు. చివరకు ఆమెను అశ్వారావుపేట బస్టాండ్‌లో వదిలివేసినట్లు సమాచారం. దీంతో భద్రమ్మ బస్టాండ్‌లోనే అందరూ ఉన్నా అనాథలా, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఆమె దీనస్థితిని చూసిన పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన కుటుంబ సభ్యులు ఆమెను ఇలా వదిలివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రమ్మను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సంబంధిత అధికారులు ముందుకు వచ్చి ఆమెకు తక్షణ సహాయం, సురక్షితమైన ఆశ్రయం కల్పించాలని కోరుతున్నారు. కన్న కొడుకు, కూతురు ఉన్నా.. చివరికి బస్టాండ్‌నే ఆమెకు దిక్కయింది. అయితే భద్రమ్మను ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
