TS Assembly: ముగిసిన తెలంగాణ అసెంబ్లీ బీఏసీ సమావేశం.. తీవ్ర అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షం.. ఎందుకంటే..
Telangana Assembly Session: ఈ రోజు నుంచి అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశం ప్రారంభమైన తర్వాత..

Telangana Assembly Session: ఈ రోజు నుంచి అసెంబ్లీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశం ప్రారంభమైన తర్వాత మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపి సభను వాయిదా వేసింది. తర్వాత బీఏసీ సమావేశమైంది.ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు కేవలం మూడు రోజుల మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది బీఏసీ. ఈ రోజు సమావేశాలు ప్రారంభం కాగా, మిగతా రెండు రోజులు 12,13వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఇంకా రెండు రోజులే నిర్వహించడంపై ప్రతిపక్ష తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశానికి తమను రానివ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. బీఏసీ జరగకుండానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తేదీలు ఫైనల్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
ఇక అసెంబ్లీలో తప్పించుకోవచ్చు కానీ, ప్రజాక్షేత్రంలో తప్పించుకోలేరన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వానికి ప్రజలు వాత పెట్టడం ఖాయమన్నారు ఈటల రాజేందర్. మరోవైపు ఈ ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వచ్చే సోమవారానికి సభ వాయిదా పడింది. సభను 12వ తేదీకి వాయిదా వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌రెడ్డి మృతికి సభ సంతాపం తెలిపింది సభ. స్వాతంత్ర్య సమరయోధురాలు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం సేవలను గుర్తు చేశారు స్పీకర్. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్ధన్‌రెడ్డి మృతికి సభ్యులు నివాళి అర్పించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..