Telangana Election: కాంగ్రెస్‌కు ఓటు వేసి.. మళ్లీ కష్టాలను కొని తెచ్చుకోవద్దు.. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
తెలంగాణలో ప్రచారానికి మిగిలింది ఇంకా ఒకటే రోజు. దీంతో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కేవేరు అన్నట్టు.. క్యాంపెయినింగ్‌లో దూకుడు పెంచారు సీఎ: కేసీఆర్. ఈ రోజు షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డిలో ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్ అధినేత.. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్‌లపై విమర్శల దాడిని కొనసాగించారు.

తెలంగాణలో ప్రచారానికి మిగిలింది ఇంకా ఒకటే రోజు. దీంతో లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కేవేరు అన్నట్టు.. క్యాంపెయినింగ్‌లో దూకుడు పెంచారు సీఎ: కేసీఆర్. ఈ రోజు షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డిలో ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్ అధినేత.. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్‌లపై విమర్శల దాడిని కొనసాగించారు.
రాష్ట్రంలో గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. 1956లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిన కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెబుతోందని షాద్‌నగర్ సభలో విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకలు తప్ప ఏమీ లేవన్నారు కేసీఆర్. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈ పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామని.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మళ్లీ బీఆర్‌ఎస్‌నే గెలిపించాలని కోరారు. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే ఉంటుందన్నారు కేసీఆర్. చేవెళ్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్.. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని భయపెట్టారని..కానీ ఇప్పుడు ధరలు ఏ విధంగా పెరిగాయో చూడాలని కోరారు.
ఇతర పార్టీలు జనాన్ని కదిలించి తెస్తుంటే.. బీఆర్‌ఎస్ సభలకు జనమే కదిలివస్తున్నారన్నారు కేసీఆర్. తమకు వారికి అదే తేడా అన్నారు. అందోల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేసీఆర్.. కాంగ్రెస్‌కు ఓటువేసి మళ్లీ కష్టాలను కొని తెచ్చుకోవద్దన్నారు. మందిని చావగొట్టిన ఇందిరమ్మ రాజ్యం కావాలా లేక.. దర్జాగా బతికే మన రాజ్యం కావాలో దయచేసి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారుల రాజ్యమే వస్తుందని.. ఢిల్లీ టు హైదరాబాద్ తిరగడానికే ఆ పార్టీ నేతలకు సరిపోతుందని విమర్శించారు. మరో పార్టీ మతపిచ్చి పార్టీ అని ఆరోపించారు. సంగారెడ్డిలో గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే ఉద్యమ ద్రోహి అని మండిపడ్డారు కేసీఆర్. అలాంటి వ్యక్తి మళ్లీ కావాలా అని ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారం చివరిరోజున వరంగల్, గజ్వేల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగే సభతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించబోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
