Telangana Election: స్టార్ క్యాంపెనర్ల తీరుపై అధిష్టానం సీరియస్.. ప్రచారంపై దృష్టి పెట్టాలని సూచన
కాంగ్రెస్ నేతల ప్రచారం విడివిడిగా బాగానే ఉంది. కానీ కలిసి ఎక్కడా కనిపించడంలేదు. ఒకరి కోసం ఒకరు పనిచేయడం కనిపించడంలేదు. స్టార్ క్యాంపెనర్లు పత్తా లేరు. కోఆర్డినేషన్ కమిటీల ఊసేలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పెద్ద క్లాసే తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాంధీ భవన్‌కు వచ్చి మరీ పరిస్థితిని సమీక్షించారు.

కాంగ్రెస్ నేతల ప్రచారం విడివిడిగా బాగానే ఉంది. కానీ కలిసి ఎక్కడా కనిపించడంలేదు. ఒకరి కోసం ఒకరు పనిచేయడం కనిపించడంలేదు. స్టార్ క్యాంపెనర్లు పత్తా లేరు. కోఆర్డినేషన్ కమిటీల ఊసేలేదు. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పెద్ద క్లాసే తీసుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాంధీ భవన్‌కు వచ్చి మరీ పరిస్థితిని సమీక్షించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫైట్ ప్రధానంగా బీఆర్‌ఎస్ vs కాంగ్రెస్ అన్నట్లుగా మారింది. రెండు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. బీఆర్‌ఎస్ నుంచి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ అయితే.. ప్రతీరోజు రెండు మూడు నియోజకవర్గాల్లో మీటింగ్స్ పెడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా అటు అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఇటు పార్టీలో సర్దుబాట్లు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ కాంగ్రెస్‌లో ఆ జోష్ కనిపించడం లేదన్నది అధిష్టాన పెద్దలే చెబుతున్నారు. గురువారం ఇందిరా భవన్‌లో ప్రధాన నేతలతో కేసీ వేణుగోపాల్ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ప్రచారం ఎలా జరుగుతోందని.. ఎక్కడెక్కడ ఎంతెంత సేపు నిర్వహిస్తున్నారో ఆరా తీశారు. కానీ ఆయన ప్రచారం జరుగుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
వర్చువల్ మీటింగ్‌లోనే కేసీ వేణుగోపాల్ నేతలపై ఫైర్ అయ్యారు. ప్రచారం అనుకున్న స్థాయిలో లేదని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్టివ్‌గా ప్రచారం నిర్వహించాలని సూచించారు. కొందరు పెద్ద నేతలు తమ నియోజకవర్గం వరకే పరిమితం అవుతున్నారని.. ఆయా జిల్లాల్లోనే మిగితా నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాలన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్ప.. మిగిలిన పెద్ద నేతలెవరూ.. గ్రౌండ్ లెవెల్‌లో యాక్టివ్‌గా లేకపోవడాన్ని తప్పుబట్టారు. మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చే శ్రద్ధ ప్రచారంలోనూ పెట్టాలని గట్టిగానే క్లాస్ తీసుకున్నారు కేసీ వేణుగోపాల్.
ఇక త్వరలోనే జరగబోయే బహిరంగ సభలపైనా ఆరాతీశారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభల నిర్వహణ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. సభలకు భారీగా జనసమీకరణ చేపట్టాలని సూచించారు. ఇక స్టార్ క్యాంపెయినర్స్, కోఆర్డినేషన్ టీమ్‌లను.. త్వరగా ఏర్పాటు చేయాలని కేసీ వేణుగోపాల్ నేతలను డైరెక్ట్ చేశారు.
ఇక తెలంగాణ ఎన్నికలపై వర్చువల్ మీటింగ్‌లో మాట్లాడారు కేసీ వేణుగోపాల్. కర్నాటక వాతావరణమే తెలంగాణలో కనిపిస్తోందన్నారాయన. 70 స్థానాల్లో విజయం సాధించి, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని, పార్టీలో ఎలాంటి గ్రూప్‌లు ఉండొద్దని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. అంతేకాదు, టికెట్లు రానివారికి బుజ్జగింపులు కొనసాగాయి. కొందరు నేతలను ఆయన ఫోన్ చేసి పిలిపించుకున్నారు. టికెట్లు రాని నూతి శ్రీకాంత్, శివసేనారెడ్డి, బల్మూరి వెంకట్‌లను కలిసి.. అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారాయన. ఇక నాలుగో లిస్టుపైనా కసరత్తుచేసి, చివరికి ఒక అభ్యర్థిని మారుస్తూ, మొత్తం ఐదు పేర్లను ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
