IAS Officers: క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు.. డీవోపీటీ ఉత్తర్వులు ర‌ద్దు చేయాలని వేర్వేరు పిటిషన్లు

తమను తెలంగాణలోనే కొనసాగించాలని క్యాట్‌ను ఆశ్రయించారు ఏపీ క్యాడర్ ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి . అలాగే తనను ఏపీలోనే కొనసాగించాలని క్యాట్‌లో పిటిషన్‌ వేశారు తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ సృజన.ఆ నలుగురి పిటిషన్లపై సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యూనల్‌ మంగళవారం విచారణ జరపనుంది.

IAS Officers: క్యాట్‌ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారులు.. డీవోపీటీ ఉత్తర్వులు ర‌ద్దు చేయాలని వేర్వేరు పిటిషన్లు
IAS Officers
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 14, 2024 | 10:41 PM

తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు ఏపీకి వెళ్లాలని.. అలాగే ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ క్యాడర్‌ అధికారులు తెలంగాణకు వెళ్లాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది డీవోపీటీ.. ఈ నెల 16లోపు రిపోర్టు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి కూడా.. అయితే, డీవోపీటీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యూలన్‌- క్యాట్‌ను ఆశ్రయించారు నలుగురు ఐఏఎస్‌లు వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి సృజన.. డీవోపీటీ ఉత్తర్వులను రద్దు చేయాలని నలుగురు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఏపీ క్యాడర్‌కు కేటాయించినప్పటికీ.. వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. తాము తెలంగాణలో కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇక తెలంగాణ క్యాడర్‌క చెందిన సృజన తనను ఏపీలోనే కొనసాగించాలే ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నలుగురి పిటిషన్లపై సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యూనల్‌ మంగళవారం విచారణ జరపనుంది.

ఏపీకి క్యాడర్‌లో ఉండి తెలంగాణలో విధులు నిర్వహిస్తోన్న ఐఏఎస్‌లు వాణీప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్, ఆమ్రపాలి, ప్రశాంతి.. తెలంగాణ సీఎస్ శాంతకుమరితో భేటీ అయ్యారు. ఆ తరువాత నలుగురు ఐఏఎస్‌లో క్యాట్‌ను ఆశ్రయించారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌లు సృజన, శివశంకర్‌, హరికిరణ్‌లు ఏపీలో పనిచేస్తున్నారు. తనను ఏపీలో కొనసాగించాలని క్యాట్‌ను ఆశ్రయించారు సృజన. ఇక ఐపీఎస్‌ల విషయానికి వస్తే ఏపీ క్యాడర్‌కు చెందిన అంజనీకుమార్, అభిలాష్‌ బిస్త్, అభిషేక్‌ మహంతి తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు.

ఏ రాష్ట్రానికి కేటాయించిన వాళ్లు ఆ రాష్ట్రానికి వెళ్లాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ ట్రైనింగ్‌ విభాగం.. డీవోపీటీ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం..16న రిపోర్ట్‌ చేయాల్సి వుండగా ఐఏఎస్‌లు క్యాట్‌ను ఆశ్రయించడం చర్చగా మారింది. గతంలో ఏపీ క్యాడర్‌కు చెందిన సోమేష్‌ కుమార్‌ తెలంగాణ సీఎస్‌గా పనిచేశారు. ఏపీలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా డీవోపీటీ ఆదేశించడంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్‌ ఆదేశాలతో ఏపీలో రిపోర్ట్‌ చేసిన సోమేష్‌ కుమార్‌ వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. ఇప్పుడు వాకాటి కరుణ, వాణీ ప్రసాద్‌, అమ్రపాలి, సృజన ఈ నలుగురు పిటిషన్లపై క్యాట్‌ ఎలాంటి డైరెక్షన్స్‌ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పొడి.. బ్రేక్ ఫాస్ట్‌లోకి అదుర్స్!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
గురకతో ఇబ్బందిగా ఉందా..? తగ్గించుకునేందుకు చిట్కాలు!
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
ఈజీగా అయిపోయే మీల్ మేకర్ మంచూరియా.. ఆరోగ్యం కూడా..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
అన్నంతో రుచిగా మురుకులు.. కరకరలాడుతూ భలేగా ఉంటాయి..
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఎల్‌ఐసీలో క్లెయిమ్‌ చేయని రూ.880 కోట్లు.. తెలుసుకోవడం ఎలా?
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
ఈ సారి చేపల వేపుడు ఇలా చేయండి.. ఆహా అదిరిపోతుంది..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
బాక్సింగ్ డే టెస్ట్‌కు ముందు కొత్త హెయిర్ కట్‌ అదరగొట్టిన విరాట్!
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
విజయ్ హజారే ట్రోఫీలో భారీ సెంచరీతో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌
ఛాతిలో పేరుకుపోయిన కఫానికి ఇలా చెక్‌ పెట్టండి.. నేచురల్‌ టిప్స్‌