Asaduddin: సరూర్‌నగర్ పరువు హత్యపై బీజేపీ, ఎంఐఎం మధ్య వార్‌.. రాజాసింగ్‌ కామెంట్‌కి అసద్‌ రియాక్షన్‌

సరూర్‌ నగర్‌ హత్యపై బీజేపీ, ఎంఐఎం మధ్య వార్‌ నడుస్తోంది. రాజాసింగ్‌ కామెంట్‌కి అసద్‌ రియాక్ట్ అయ్యారు.

Asaduddin: సరూర్‌నగర్ పరువు హత్యపై బీజేపీ, ఎంఐఎం మధ్య వార్‌.. రాజాసింగ్‌ కామెంట్‌కి అసద్‌ రియాక్షన్‌
Asaduddin Owaisi
Follow us

|

Updated on: May 07, 2022 | 11:05 AM

Saroor Nagar Honour Murder: హైదరాబాద్ మహానగరంలో సంచలనం సృష్టించిన సరూర్ నగర్ పరువు హత్య కేసుపై ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. నాగరాజు హత్యను ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఆశ్రిన్ సుల్తానా తన ఇష్టపూర్వకంగానే నాగరాజును పెళ్లి చేసుకోవడం సరైందేనని ఆయన అన్నారు. సుల్తాన్ సోదరుడు ఆమె భర్తను హత్య చేయడం క్రూరమైన చర్యగా అభివర్ణించారు. రాజ్యాంగం ప్రకారమైనా, ఇస్లాం ప్రకారమైనా.. ఇది నేరపూరిత చర్యగా భావించాలన్నారు.

సరూర్‌ నగర్‌ హత్యపై బీజేపీ, ఎంఐఎం మధ్య వార్‌ నడుస్తోంది. రాజాసింగ్‌ కామెంట్‌కి అసద్‌ రియాక్ట్ అయ్యారు. సరూర్ నగర్ హత్య ఘటనకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి ఒవైసీ కామెంట్స్ చేశారు. హత్య ఘటనలో నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని… తాము హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదని అన్నారు.

మరోవైపు, దేశంలో ఎక్కడ ముస్లింలపై దాడులు జరిగినా స్పందించే ఒవైసీ… సరూర్ నగర్ ఘటనపై మాత్రం ఎందుకు స్పందించట్లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఒవైసీ స్పందించకపోవడం హత్యకు మద్దతునిచ్చినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హత్య ఘటనను ఖండిస్తూ ఒవైసీ స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మతాంతర వివాహం వల్లే నాగరాజును హత్య చేశారని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. హత్యకు వేరే రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారని ఒవైసీ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

కాగా, సరూర్ నగర్‌లో బిల్లపురం నాగరాజు పరువు హత్యపై గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. అటు, జాతీయ ఎస్సీ కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఘటనపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, హైదరాబాద్ కలెక్టర్లకు నోటీసలు జారీ చేసింది.

ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లాకు చెందిన బిల్లపురం నాగరాజు, సయ్యద్ అశ్రిన్ సుల్తానా ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌ పాతబస్తీలోని ఆర్య సమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి సుల్తానా కుటుంబ సభ్యుల జీర్ణించుకోలేకపోయారు. పెళ్లి తర్వాత ఈ జంటను సుల్తానా కుటుంబం పలుమార్లు వెంటాడింది. ఈ క్రమంలో కొన్నాళ్లు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోయారు. ఇటీవలే తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన కొత్త జంట సరూర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ విషయం పసిగట్టి, మే 4 బైక్‌పై ఇంటి నుంచి బయటకెళ్లిన జంటపై సుల్తానా సోదరుడు, అతని స్నేహితుడు కలిసి దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే గడ్డపారాలతో నాగరాజుపై దాడి చేసి హత్య చేశారు.

Read Also….  Indore Fire Accident: రెండంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. మహిళతో సహా ఏడుగురు సజీవ దహనం

Latest Articles