AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Hyderabad Tour: తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్‌ గాంధీ భేటీ.. మరికాసేపట్లో సంజీవయ్య పార్క్‌కు..

హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్‌ సమావేశం నిర్వహించారు. ఇక మరికాసేపట్లో సంజీవయ్య పార్క్‌కు వెళ్లి, అక్కడ దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులర్పిస్తారు.

Rahul Hyderabad Tour: తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్‌ గాంధీ భేటీ.. మరికాసేపట్లో సంజీవయ్య పార్క్‌కు..
Rahul Gandhi
Balaraju Goud
|

Updated on: May 07, 2022 | 11:37 AM

Share

Rahul Gandhi Hyderabad Tour: హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీ బిజీ అయ్యారు. రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కి సహా మరికొందరు ముఖ్యనేతలతో భాగ్యనగరంలో పర్యటిస్తున్నారు. హోటల్‌ తాజ్‌కృష్ణాలో బస చేసిన ఆయనను పార్టీ నాయకులతో పాటు.. గద్దర్‌ వంటి మరికొందరు ముఖ్యులు రాహుల్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్‌ సమాశమయ్యారు. అనంతరం దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులర్పిస్తారు. అక్కడినుంచి నేరుగా చంచల్ గూడ జైలు దీక్ష చేస్తున్న ఎన్ఎస్‌యూఐ నేతలతోనూ భేటీ అవుతున్నారు.

అంతకుముంద హైడ్రామా నడుమ చంచల్‌గూడ జైల్లో రాహుల్‌ గాంధీ ములాఖత్‌కు పర్మిషన్‌ లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంచల్‌గూడ వెళ్లనున్న రాహుల్‌ జైల్‌లో ఉన్న NSUI నేతలు, కార్యకర్తలను పరామర్శించనున్నారు. దీంతో జైలు దగ్గర అదనపు బలగాలను మోహరించి భద్రత పెంచారు పోలీసులు. రాహుల్, రేవంత్.. ఇద్దరికి మాత్రమే అనుమతి లభించింది. అయితే, చివరి నిమిషంలో ములాఖత్‌కు అనుమతివ్వడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల. ఇప్పటికిప్పుడు అనుమతి అంటే ఎలా ప్లాన్ చేసుకుంటారని ప్రశ్నించారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్‌ సమావేశం నిర్వహించారు. ఇక మరికాసేపట్లో సంజీవయ్య పార్క్‌కు వెళ్లి, అక్కడ దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులర్పిస్తారు. ఒంటి గంటా 50 నిమిషాలకు గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమావేశమై, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సభ్యత నమోదు కోఆర్డినేటర్లతో ఫొటో సెషన్ తర్వాత, సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

ఇవి కూడా చదవండి

వరంగల్‌ సభ తర్వాత, రాహుల్‌ టూర్‌పై మరోసారి ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్‌. పొలిటికల్‌ టూరిస్ట్‌లు వస్తారు… పోతారు అంటూ ఎద్దేవా చేశారు. కానీ, తెలంగాణలో ఉండేది మాత్రం కేసీఆర్‌ మాత్రమేనంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. కేటీఆర్‌ ట్వీట్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌ అంతే ధీటుగా కౌంటర్‌ ఇచ్చారు. కేటీఆర్ దృష్టిలో తెలంగాణ టూరిస్ట్ ప్లేస్‌ అయితే… కాంగ్రెస్‌ దృష్టిలో తెలంగాణ అమరుల త్యాగఫలం అంటూ ట్వీట్ చేశారు రేవంత్. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణను… కేటీఆర్‌ టూరిస్ట్ ప్లేస్‌ అంటున్నారని రేవంత్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ సమర్థుడైతే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారంటూ ప్రశ్నించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కాంగ్రెస్ పార్టీ పొత్తు కోసం ఇతర పార్టీల కాళ్లు పట్టుకొని బతిమాలినా ఎవరూ పొత్తు కోసం సిద్ధంగా లేరన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు.