Telangana: మంత్రి బర్త్‌డే.. వినూత్నంగా సెలబ్రేట్ చేసిన అభిమాని.. ప్రజలకు ఏం పంచిపెట్టాడో మీరే చూడండి..

Suryapet, July 18: పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా కేకులు కట్ చేస్తారు.. స్వీట్లు పంచుతారు.. ఇంకా ఓ అడుగు ముందుకేసి అన్నదానాలు చేస్తారు. కానీ సూర్యాపేటలో ఓ వ్యక్తి టొమాటాలు పంచి తమ అభిమాన నేత బర్త్ డే వేడుకలను వెరైటీగా జరిపారు.

Telangana: మంత్రి బర్త్‌డే.. వినూత్నంగా సెలబ్రేట్ చేసిన అభిమాని.. ప్రజలకు ఏం పంచిపెట్టాడో మీరే చూడండి..
Minister Jagdish Reddy

Edited By: Shiva Prajapati

Updated on: Jul 18, 2023 | 1:50 PM

Suryapet, July 18: పుట్టినరోజు వేడుకంటే ఎవరైనా కేకులు కట్ చేస్తారు.. స్వీట్లు పంచుతారు.. ఇంకా ఓ అడుగు ముందుకేసి అన్నదానాలు చేస్తారు. కానీ సూర్యాపేటలో ఓ వ్యక్తి టొమాటాలు పంచి తమ అభిమాన నేత బర్త్ డే వేడుకలను వెరైటీగా జరిపారు. ఇందుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. తమ అభిమాన నేత, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను సూర్యాపేటలో వెరైటీగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా నేత పల్సా వెంకన్న గౌడ్ భావించాడు. గత నెల రోజులుగా దేశంలో పెరుగుతున్న టమాటా రేట్లు ప్రజలను హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా పెరుగుతున్న టమాటో రేట్ల పైనే చర్చ జరుగుతుంది. ఈ ట్రేండింగ్ అంశాన్ని తీసుకుని రొటీన్‌కు భిన్నంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టమటాలు పంచిపెట్టాడు మంత్రి వీరాభిమాని. వినూత్నంగా జరిగిన మంత్రి జన్మదిన వేడుకలు సూర్యాపేటలోనే కాకుండా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హాట్ డిస్కర్షన్‌గా మారింది.

వంటింట్లో ప్రతి వంటలో టమాటాల పాత్ర ఎంత ముఖ్యమో.. సూర్యాపేట సర్వతోముఖాభివృద్ధిలో మంత్రి జగదీష్ రెడ్డి పాత్ర కూడా అలాంటిదేనని సింబాలిక్‌గా చెప్పడానికే తాను ఈ ప్రయత్నం చేశానని పల్స వెంకన్న గౌడ్ చెబుతున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ తలలో నాలుకలా ప్రజలందరి కష్టసుఖాల్లో మంత్రి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నాడు. టమాటాలు లేని వంట.. మంత్రి జగదీష్ రెడ్డి లేని సూర్యాపేట అభివృద్ధి లేదనేది నిజమని చాటిచెప్పే ప్రయత్నం చేశామని వెంకన్న చెప్పారు.

ఇవి కూడా చదవండి

Tomatoes Distribution

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..