
ఓ వైపు ఎండలు దంచి కొడుతున్నాయి. మరోవైపు పిల్లల నుంచి పెద్దల వరకు వడదెబ్బకు బాధితులుగా మారుతున్నారు. భానుడి భగభగలకు పగటిపూట ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతుండడంతో.. జనాలు ఎండ వేడిని, ఉక్కపోతను తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కొన్ని హెచ్చరికలు, సూచనలు అందించింది. పెరుగుతోన్న ఎండలకు ఎక్కువగా బయట తిరగవద్దని, అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే వడదెబ్బ తగిలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. చెమట పట్టకపోవడం
2. శరీర ఉష్ణ్రోగత పెరగడం
3. వణుకు పుట్టడం
4. మగత నిద్ర లేదా కలవరింతలు
5. ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి
1. తీవ్ర ఉష్ణోగ్రతలుండే సమయంలో ఎక్కువగా తిరగకూడదు.
2. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు తాగకూడదు.
3. రోడ్లమీద అమ్మే కలుషిత ఆహారం తినకూడదు.
4. మాంసాహారం తగ్గించాలి.
5. తాజా కూరగాయాల్ని ఆహారంగా తీసుకోవాలి.
6. మద్యం సేవించకూడదు.
1. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
2. నలుపు, మందంగా ఉండే దుస్తులకు బదులు లేత రంగుల్లో లభించే తేలికైన కాటన్ దుస్తులు ధరించాలి.
3. రోజు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి.
4. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
5. ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి.
6. ఎండవేళ ఇంటిపట్టునే ఉండాలి. బయటికి వెళ్లాల్సివస్తే గొడుగు, టోపీ వంటివి తీసుకెళ్లడం మంచిది.
7. ఇంట్లో కిటికీలు తెరిచి ఉండాలి.
1. వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి చేర్చాలి.
2. చల్లటి నీటిలో ముంచిన తడిగుడ్డతో శరీరం అంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చే వరకు ఇలాగే చేస్తుండాలి.
3. ఫ్యాన్ గాలి లేదా చల్లని గాలి తగిలేలా చూడాలి.
4. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిగిన గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించాలి.
5. పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు ఎండాకాలం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
6. వడదెబ్బ తగిలి అపస్మారక పరిస్థితిలో ఉన్న రోగికి నీరు తాగించకూడదు. వీలయినంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలి.
రానున్న రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది.