AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇదేందయ్యా ఇదీ.. మరిచెట్టు నుంచి కల్లు.. లొట్టలేసుకుంటూ తాగుతున్న జనాలు.. వీడియో చూడండి..

తాటి చెట్టు, ఈత చెట్టు నుంచి కల్లు కారడం సహజమే.. కానీ ఎప్పుడైనా మర్రిచెట్టు నుంచి కల్లు ధారలా కారడం చూశారా? మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఓ భారీ మర్రిచెట్టు వేరు నుంచి లొట్టినిండా కల్లు కారుతుండటంతో కల్లు ప్రియులు లొట్టలేసుకుంటూ తాగుతున్నారు. అసలు మర్రిచెట్టుకు కల్లు ఎలా వచ్చింది? అనేది తెలుసుకుందాం..

Telangana: ఇదేందయ్యా ఇదీ.. మరిచెట్టు నుంచి కల్లు.. లొట్టలేసుకుంటూ తాగుతున్న జనాలు.. వీడియో చూడండి..
Toddy Oozes Out From Banyan Tree
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 2:39 PM

Share

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తాటి చెట్లు, ఈత చెట్లను గీసి కల్లు తీయడం అందరికీ తెలిసిందే. కానీ మహబూబాబాద్ జిల్లాలో ఎక్కడా చూడని ఓ వింత దృశ్యం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏకంగా ఓ భారీ మర్రిచెట్టు వేరు నుంచి ధారగా కల్లు జాలువారుతుండటంతో కల్లు ప్రియులు లొట్టలేసుకుంటూ తాగుతున్నారు. ప్రస్తుతం ఈ మర్రి కల్లు వ్యవహారం జిల్లావ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ అరుదైన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వెలుగుచూసింది. బయ్యారం తహశీల్దార్ కార్యాలయం సమీపంలోని చిన్నాలకుంట చెరువు వద్ద ఓ పురాతన మర్రిచెట్టు ఉంది. ఇటీవల సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పూడికతీత పనులు చేపట్టిన సమయంలో ఈ మర్రిచెట్టుకు సంబంధించిన పెద్ద వేరు తెగిపోయింది. ఆ తర్వాత మూడు, నాలుగు రోజులుగా ఆ తెగిన వేరు నుంచి తెల్లటి ద్రవం ధారగా కారుతుండటాన్ని స్థానిక గీత కార్మికుడు ఆకుల శ్రీను గమనించారు.

లొట్టి నిండా కల్లే..

మొదట పరిశీలించిన శ్రీను.. అది అచ్చం కల్లులాగే ఉండటంతో నాలుగు రోజుల పాటు నిశితంగా గమనించారు. వేరు నుంచి కల్లు వస్తున్నట్లు నిర్ధారించుకున్న తర్వాత తన గీత కత్తితో ఆ వేరుకు ప్రత్యేకంగా గీతలు పెట్టి అక్కడ లొట్టిని ఏర్పాటు చేశారు. కొద్దిసేపట్లోనే లొట్టి నిండా కల్లు నిండిపోవడంతో స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఈ విచిత్రంపై సమాచారం అందుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, కల్లు ప్రియులు పెద్ద సంఖ్యలో చిన్నాలకుంట చెరువు వద్దకు తరలివస్తున్నారు. గీత కార్మికుడు శ్రీను ఆ వేరు నుంచి సేకరించిన మర్రి కల్లును స్థానికులకు విక్రయిస్తుండగా.. సహజసిద్ధమైన ఆ రుచిని చూసేందుకు జనం బారులు తీరుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈ వింతను చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆసక్తిగా తరలివస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us