AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Holidays: ఏపీ, తెలంగాణలో దసరా సెలవులపై క్లారిటీ వచ్చేసింది.. విద్యార్థులకు పండుగే.. పండుగ..

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వాలు స్పష్టతిస్తాయి. ఏపీ, తెలంగాణలో సెలవుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులకు ముందు పరీక్షలు నిర్వహించనుంది. విద్యార్థులు దసరా సెలవుల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు. దీంతో ప్రభుత్వం ముందే క్లారిటీ ఇచ్చింది.

Dasara Holidays: ఏపీ, తెలంగాణలో దసరా సెలవులపై క్లారిటీ వచ్చేసింది.. విద్యార్థులకు పండుగే.. పండుగ..
Schools
Venkatrao Lella
|

Updated on: Sep 20, 2026 | 4:58 PM

Share

ఏపీ, తెలంగాణలోని విద్యార్థుకు భారీ శుభవార్త అందింది. దసరా సెలవుల లిస్టును తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా సెలవులు ఉన్నాయి. ఈ మేరకు విద్యాశాఖలు దసరా సెలవుల లిస్టును విడుదల చేశాయి. దసరా వస్తుందంటే చాలు.. ముందుగా సెలవుల గురించే ఎక్కువ చర్చ జరుగుతూ ఉంటాయి. విద్యార్థులు పండుగ సెలవుల కోసం ఎదురుచూస్తుంటారు. సెలవుల్లో తమ సొంతూర్లకు వెళ్లి కుటుంబంతో సరదాగా గడుపుతుంటారు. ఏపీ, తెలంగాణలో విద్యాసంస్థలకు దసరా సెలవులు ఎప్పటినుంచి ఎప్పటివరకు అనేది ఇప్పుడు చూద్దాం.

ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఇవే..

తెలంగాణలో మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.  దసరాతో పాటు బతుకమ్మ కూడా వస్తుండటంతో ఎక్కువ రోజులు సెలవులు ఇచ్చింది. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు చివరి వర్కింగ్ డే అక్టోబర్ 9. ఆ తర్వాత సెలవుల అనంతరం అక్టోబర్ 23వ తేదీనుంచి విద్యాసంస్థలు తిరిగి తెరుకుంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయి. తప్పనిసరిగా అన్ని సంస్థలు వీటిని అమలు చేయాల్సి ఉంటుంది. ఇక ఏపీ విషయానికొస్తే.. 10 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు వచ్చాయి. 2026-27 విద్యా క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి దసరా పండుగ సెలవులు మొదలవుతాయి. అక్టోబర్ 21 వరకు మొత్తం 10 రోజుల పాటు సెలవులు కొనసాగుతాయి. ఏపీ, తెలంగాణలో సెలవులు భిన్నంగా ఉన్నాయి. అయితే క్రైస్తవ, మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించి సెలవులు భిన్నంగా ఉంటాయి.

బతుకమ్మ పండుగ ఎప్పుడంటే..?

ఈ సారి అక్టోబర్ 20వ తేదీన దసరా పండుగ వస్తోంది. ఇక బతుకమ్మ కూడా ఇదే తేదీలో వస్తోంది. అక్టోబర్ 11న బతుకమ్మ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 18వ తేదీన సద్దుల బతుకమ్మ జరగనుంది. తెలంగాణ ప్రజలు బతుకమ్మను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక తెలంగాణలో అక్టోబర్ 1 నుంచి 9 వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు జరుగుతాయి. ప్రాధమిక తరగతుల విద్యార్థులకు అక్టోబర్ 5 నుంచి 9 వరకు, 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు అక్టోబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తారు. సెలవుల నుంచి వచ్చిన తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. SA-2 పరీక్షలు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు  వచ్చే ఏడాది ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 19 వరకు నిర్వహిస్తారు. పదో తరగతి ప్రీ-ఫైనల్స్ పరీక్షలు  ఫిబ్రవరి 28 నాటికి పూర్తి కానున్నాయి. దసరా సెలవులకు ముందే తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు పూర్తి చేస్తుంది.

Follow Us
ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన.. మొత్తం ఎన్ని రోజులంటే..?
ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల ప్రకటన.. మొత్తం ఎన్ని రోజులంటే..?
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
జపాన్‌తో భారత్ ప్రత్యేకంగా క్రికెట్ మ్యాచ్ ఎందుకు ఆడుతోంది?
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
మల్లెపూల పల్లకి సాంగ్‌లానే మరో పాపులర్ పాట..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
పెరిగిన చికెన్ ధరలు.. అదే బాటలో కోడి గుడ్లు కూడా..
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
ప్రతి రోజూ ఇది ఒక గిన్నెడు తింటే.. దెబ్బకు డయాబెటిస్ జారుకుంటాది
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
'5 సార్లు మెయిన్స్.. 3 ఇంటర్వ్యూ.. 6వ ప్రయత్నంలో IPS అయ్యాడు'
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
తరచూ కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో గ్యాస్, అజీర్తి
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
దసరాకు సొంతూరు వెళ్తున్నాారా? రైల్వేశాఖ నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
వన్డే, టెస్టుల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదింది వీళ్లే
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా
మినప ఇడ్లీ కంటే 5 రెట్లు ఎక్కువ.. ఉదయాన్నే రెండు తింటే యవ్వనంగా