గాంధీ, నిమ్స్ ఆసుపత్రి పరిధిలో గర్భిణిల కోసం స్పెషల్ ఎంసీహెచ్ బిల్డింగ్

| Edited By: Aravind B

Jul 18, 2023 | 1:54 PM

మాత శిశు సంరక్షణ కోసం దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ పరిధిలో ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కోటి,పెట్ల బురుజుతో పాటు గాంధీ, నిమ్స్ ఆస్పత్రి పరిధిలో గర్భిణీల కోసం మరో రెండు ఆసుపత్రుల్ని సిద్దం చేస్తుంది వైద్య ఆరోగ్య శాఖ.

గాంధీ, నిమ్స్ ఆసుపత్రి పరిధిలో గర్భిణిల కోసం స్పెషల్ ఎంసీహెచ్ బిల్డింగ్
Nims
Follow us on

మాత శిశు సంరక్షణ కోసం దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ పరిధిలో ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కోటి,పెట్ల బురుజుతో పాటు గాంధీ, నిమ్స్ ఆస్పత్రి పరిధిలో గర్భిణీల కోసం మరో రెండు ఆసుపత్రుల్ని సిద్దం చేస్తుంది వైద్య ఆరోగ్య శాఖ. ఇందులో భాగంగా నిమ్స్ పరిధిలో ప్రత్యేకించి మాత శిశు సంరక్షణ కోసం ప్రత్యేక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయగా..గాంధీ పరిధిలో ఎంసీహెచ్ సెంటర్‎ని సిద్ధం చేసింది. జూలై చివరి నాటికి గాంధీ పరిధిలో ఏర్పాటైన మదర్ అండ్ చైల్డ్ సెంటర్‎నీ ప్రారంభిస్తామని చెబుతోంది వైద్యారోగ్య శాఖ.

గర్భం దాల్చిన మహిళలకు ఏదైనా సమస్యలు వస్తే సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు పెద్ద ఆసుపత్రులైన గాంధీ, నిమ్స్, ఉస్మానియా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కానీ గాంధీ తో పాటు నిమ్స్ పరిధిలోని ఎంసీహెచ్ సెంటర్‎లు అందుబాటులోకి వస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా గర్భిణీ మహిళ నేరుగా ఈ MCH సెంటర్ కి వెళ్లి చికిత్స తీసుకోవచ్చు. దీంతో సమయంతో పాటు ప్రాణాపాయ స్థితికి వెళ్లకుండా జాగ్రత్త పడొచ్చు అనేది వైద్యారోగ్య శాఖ ఆలోచన. ఇదిలా ఉండగా గాంధీ ఆసుపత్రి పరిధిలో ఎంసీహెచ్‌ను రూ.55 కోట్లతో.. ఎనిమిది అంతస్తుల బిల్డింగ్‎లో ఏర్పాటు చేశారు. దాదాపు 200 బెడ్స్ తో ఈ ఎంసీహెచ్ సెంటర్ అందుబాటులోకి రానుంది. ఆధనాతన సదుపాయలతో పాటు ఫర్టిలిటీ విభాగం సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి