AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS vs Cong: కరువుతో రైతుల ఇక్కట్లు.. అధికార విపక్షాల మధ్య ముదురుతున్న డైలాగ్ వార్‌

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య సరికొత్త వార్ స్టార్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు.. రైతుల ఇబ్బందులపై ప్రతిపక్ష పార్టీ ఫైర్ అవుతుంటే.. తప్పంతా మీదే అంటూ రివర్స్ కౌంటర్స్ ఇస్తోంది అధికార కాంగ్రెస్.

BRS vs Cong: కరువుతో రైతుల ఇక్కట్లు.. అధికార విపక్షాల మధ్య ముదురుతున్న డైలాగ్ వార్‌
Revanth Reddy Ktr
Balaraju Goud
|

Updated on: Mar 10, 2024 | 10:26 AM

Share

పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య సరికొత్త వార్ స్టార్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు.. రైతుల ఇబ్బందులపై ప్రతిపక్ష పార్టీ ఫైర్ అవుతుంటే.. తప్పంతా మీదే అంటూ రివర్స్ కౌంటర్స్ ఇస్తోంది అధికార కాంగ్రెస్.

ఓవైపు కరువు పరిస్థితులు, మరోవైపు ప్రతిపక్షం-అధికారపక్షం మధ్య డైలాగ్ వార్‌తో.. తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రైతుల పంటలెండుతున్నా.. అధికార కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, అధిక వర్షాలు నమోదైనా.. పంటలకు నీళ్లిచ్చే ఇష్టం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

నీళ్లు ఇవ్వడం చేతకాక కాళేశ్వరంను సాకుగా చూపుతున్నారని విమర్శించారు కేటీఆర్. రెండు పిల్లర్ల సమస్యను చూపించి.. కాళేశ్వరం అంతా కొట్టుకుని పోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల మీద ప్రేమ ఉంటే.. కాళేశ్వరం వెంటనే రిపేర్ చేసి.. రైతులకు నీళ్లు అందించాలన్నారు కేటీఆర్.

కేటీఆర్ విమర్శలకు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా మేడ్చల్‌ సభలో అదేస్థాయిలో కౌంటర్స్ ఇచ్చారు. పనిమంతుడు పందిరేస్తే.. కుక్కతోక తగిలి కూలిపోయిందన్నట్లు.. మేడిగడ్డ తయారైందన్నారు రేవంత్. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు 50ఏళ్లయినా చెక్కు చెదరలేదని.. బీఆర్ఎస్ లక్షకోట్లతో కట్టిన కాళేశ్వరం మూడేండ్లకే కూలిందన్నారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకే.. తమకు ఉచిత సలహాలు ఇస్తున్నారన్నారు రేవంత్.

మరోవైపు.. కాళేశ్వరంపై ఏ నిర్ణయం అయినా.. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ తర్వాతే అంటున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చిన NDSA టీమ్.. బ్యారేజీలను పరిశీలించిందని, వారిచ్చే నివేదిక ఆధారంగా కాళేశ్వరంపై ముందుకెళ్తామన్నారు. రిపేర్లా, రీ కన్‌స్ట్రక్షనా అనేది త్వరలోనే తేలుతుందన్నారు ఉత్తమ్.

కాళేశ్వరంపై అధ్యయనానికి కేంద్ర జలశక్తి శాఖ పంపిన కమిటీ టూర్ ముగిసింది. రాష్ట్రంలో మూడ్రోజులు పర్యటించిన NDSA కమిటీ మంత్రి ఉత్తమ్ సహా.. ఇరిగేషన్ అధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో భేటీ అయింది. క్షేత్రస్థాయిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించింది. అడిగిన సమాచారం ఇవ్వలేదని చివరిరోజు ఇంజినీర్ల తీరుపై కమిటీ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 4 నెలల్లో రిపోర్ట్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించడంతో.. మరోసారి NDSA కమిటీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది.

కాళేశ్వరంపై ఒకవైపు కేంద్రం దర్యాప్తు కొనసాగుతుండగానే.. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తప్పు మీదంటే.. మీదని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరోవైపు.. కరువుతో పొలాలకు నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ కరువు యుద్ధం.. బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…