Telangana: రైలు ప్రమాదం జరిగితే ఏం చేయాలి.? ఎలాంటి చర్యలు తీసుకోవాలి..
రైలు ప్రమాదం జరిగితే ఏం చేయాలి.? ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. అనే విషయాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే అధికారులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించగా.. అసలు ఏం జరిగింది.? ఆ వివరాలు ఎలా.? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..

రైలు పట్టాలు తప్పడం, రెండు రైళ్లు ఢీకొనడం లాంటి రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి అనే దానిని ప్రజలకు వివరించేందుకు సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. రైలు ప్రమాదం జరిగినప్పుడు ఏఏ డిపార్ట్మెంట్ లు అందుబాటులో ఉంటాయి. ఎవరు ఎలా స్పందిస్తారు అనే దానిని చేసి చూపించారు. రైలు ప్రమాదంలో చిక్కుకున్న ప్రయాణికులను ఏవిధంగా బయటకు తీయాలి అనే దానిని కళ్ళకు కట్టినట్లు మాక్ డ్రిల్ చేసి చూపించిన రైల్వే అధికారులు. బొల్లారం రైల్వే స్టేషన్‌లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించిన రైల్వే అధికారులు.
మాక్ డ్రిల్‌లో 22 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 24 మంది స్కౌట్ అండ్ గైడ్స్ సిబ్బంది, 50 మంది ఫైర్ బ్రిగెడర్స్, మెడికల్, సిగ్నల్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ సిబ్బంది, యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ సిబ్బంది, ఆర్పిఎఫ్ పోలీసులతో పాటు ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది మార్క్ డ్రిల్ పాల్గొని రైలు ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలో ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. రైలు ప్రమాదం జరిగినప్పుడు రైలులో చిక్కుకుపోయిన ప్రయాణికులను బయటకు తీసుకురావడం కొరకు రైలు కిటికీలను కట్ చేయటం రైలు టాప్‌లో హోల్ పెట్టి లోపలికి రైల్వే సిబ్బంది దిగి ప్రయాణికులను బయటకు తీసుకురావడం.. తీసుకొచ్చిన ప్రయాణికులను ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించడం లాంటివి కళ్లకు కట్టినట్టు చూపించింది రైల్వే సిబ్బంది.
రైలు ప్రమాదంలో మరణించిన లేదా గాయపడ్డ ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించటం లాంటివి ఇలా చేయాలో చేసి చూపించారు. రైలు అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా మంటలు ఆర్పాలి ఏ విధంగా స్పందించాలనేది చూపించిన రైల్వే ఫైర్ అధికారులు.