Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ముసలోడే కానీ పెద్ద కంత్రీ.. పాతబస్తీ రోడ్లపై ఏం చేశాడో చూస్తే కళ్లు తేలేస్తారు..

సాధారణంగా వయస్సుపైబడిన వారు ఏం చేస్తుంటారు.? ఇంట్లో ఒక దగ్గర కూర్చుని సీతా..రామ.. అనుకుంటూ ఉంటారు అని అనుకుంటున్నారా.? అయితే ఇక్కడొక ముసలాయన అలా చేయలేదు. పాతబస్తీ రోడ్లపై తిరుగుతూ.. ఏం చేశాడో చూస్తే.. ఆ వివరాలు ఇలా.. ఓ లుక్కేయండి.

Hyderabad: ముసలోడే కానీ పెద్ద కంత్రీ.. పాతబస్తీ రోడ్లపై ఏం చేశాడో చూస్తే కళ్లు తేలేస్తారు..
Hyderabad
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Ravi Kiran

Updated on: Mar 12, 2025 | 8:52 PM

చేతిలో తుపాకీ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా వ్యవహరిస్తున్నారు. తమని ఎవరు ఆపేది అన్నట్లు రెచ్చిపోతున్నారు. వారికి కావాల్సిన పని అయ్యేలా చూసుకుంటున్నారు. ఎవరికీ భయపడేది లేదన్నట్టు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు వృద్ధాప్యంలో కొంతమందికి గన్ లైసెన్స్ ఇవ్వడం పాతబస్తీలో తలకు మించిన భారంగా మారింది.

హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్ఖాన్ బజార్ ఏరియాలో ఓ వృద్ధుడు వీరంగం సృష్టించాడు. ఓ ప్రాపర్టీ తనకి అమ్మాలని గన్నుతో బెదిరించి దాడి చేసి నానా హంగామా చేశాడు. అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటే ఎదురుదాడి చేశాడు. అంతటితో ఆగకుండా అసభ్యపదజాలంతో తిడుతూ రచ్చ రచ్చ చేశాడు. తమ దగ్గర నుంచి బలవంతంగా ఆస్తి అమ్మాలని చాలా కాలం నుంచి వృద్ధుడు వేధిస్తున్నాడని బాధితులు ఈ మేరకు వాపోయారు. గన్ తీసుకొచ్చి మరీ తమపై దాడి చేస్తూ ప్రాపర్టీ అమ్మాలని బెదిరించినందుకు గాను వృద్ధుడిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. చాలా కాలంగా ఆ వృద్ధుడితో ఉన్న సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వృద్ధుడు తనపై దాడి చేస్తుండగా.. ఆ తతంగాన్ని అంతా బాధితుడు మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు.

అయితే నగరంలోని పాతబస్తీలాంటి ఏరియాల్లో పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు చాలా మంది వృద్ధాప్యంలో గన్ను తీసుకుని రోడ్లపై ఈ విధంగానే హంగామా సృష్టిస్తున్నారనేది స్థానికులు చెబుతున్న మాట. గన్ లైసెన్స్ ఇచ్చే ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇలాంటి సమస్యలు ఎదురుకావని చెబుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడినవారి దగ్గర నుంచి గన్స్ లాంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని విన్నవిస్తున్నారు. ఈ క్రమంలో నగర కమిషనర్‌కు ఇందుకు సంబంధించి పాతబస్తీ వాసులు విజ్ఞప్తి చేస్తూ.. నగరంలో దాడులు, నేరాలను అరికట్టాల్సిందిగా కోరారు.