AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌లు.. హైదరాబాద్‌లో మరో చిన్నారి మృతి..

లిఫ్ట్‌లు ప్రాణాలు తీసేస్తున్నాయ్‌.. హైదరాబాద్‌లో వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు భయపెడుతున్నాయ్‌.. మొన్న నాంపల్లిలో అర్ణవ్‌ మృతిని మర్చిపోకముందే.. మరో బాలుడు లిఫ్ట్‌కి బలైపోయాడు.. ఓ హాస్టల్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఏడాదిన్నర బాలుడు మృత్యువాత పడ్డాడు.. ఇక, రెండ్రోజులక్రితం సిరిసిల్లలో లిఫ్ట్‌కి పోలీస్‌ కమాండెంట్‌ గంగారాం సైతం బలైపోయారు..

Hyderabad: ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌లు.. హైదరాబాద్‌లో మరో చిన్నారి మృతి..
Hyderabad Lift Accident
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 13, 2025 | 7:53 AM

Share

లిఫ్ట్‌లు ప్రాణాలు తీసేస్తున్నాయ్‌.. హైదరాబాద్‌లో వరుస లిఫ్ట్‌ ప్రమాదాలు భయపెడుతున్నాయ్‌.. మొన్న నాంపల్లిలో అర్ణవ్‌ మృతిని మర్చిపోకముందే.. మరో బాలుడు లిఫ్ట్‌కి బలైపోయాడు.. ఓ హాస్టల్‌ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఏడాదిన్నర బాలుడు మృత్యువాత పడ్డాడు.. ఇక, రెండ్రోజులక్రితం సిరిసిల్లలో లిఫ్ట్‌కి పోలీస్‌ కమాండెంట్‌ గంగారాం సైతం బలైపోయారు.. దీంతో లిఫ్ట్ అంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌ నగరంలోని మెహదీపట్నంలో లిఫ్ట్ ఓ బాలుడి ప్రాణం తీసింది.. లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని చిన్నారి మృతి చెందాడు.. మెహదీపట్నంలోని మెన్స్ హాస్టల్‌లో ఈ ఘటన జరిగింది..

మృతిచెందిన బాలుడు.. హాస్టల్‌లో వాచ్‌మెన్‌ కుమారుడు సురేందర్‌ గా పోలీసులు తెలిపారు.. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీలో కుతుబ్షాహీ మజీద్ సమీపంలో ముస్తఫా అపార్ట్‌మెంట్లో హాస్టల్ నిర్వహిస్తున్నారు. అదే అపార్ట్‌మెంట్ సెక్యూరిటీగార్డు కుమారుడు ఏడాదిన్నర వయసు ఉన్న సురేందర్ ప్రమాదవశాత్తు లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రక్తపు మడుగులో ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడు ఇలా విగత జీవిగా మిగలడంతో ఆ కన్నవాళ్లు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

రెండు వారాల క్రితం..

రెండు వారాలక్రితం ఇదేవిధంగా నాంపల్లిలో ప్రాణాలు కోల్పోయాడు బాలుడు అర్ణవ్‌. లిఫ్ట్‌కి స్లాబ్‌ గోడకి మధ్య ఇరుక్కుని తీవ్ర గాయాలపాలయ్యాడు. పొత్తి కడుపు నలిగిపోయి ఇంటర్నల్‌ బ్లీడింగ్‌తో మృత్యువాత పడ్డాడు అర్ణవ్‌… పర్యవేక్షణలోపం, పెద్దల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. తాతతోపాటు వచ్చిన అర్ణవ్‌.. లిఫ్ట్‌ గేట్లు తెరిచి ఉండగానే బటన్‌ నొక్కడంతో పైకి కదిలింది. భయంతో బయటికి వచ్చే ప్రయత్నంచేసిన అర్ణవ్‌.. లిఫ్ట్‌కి గోడకి మధ్య ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. గేట్లు తెరిచి ఉండగానే లిఫ్ట్‌ కదలడంతోనే ఈ ప్రమాదం జరిగింది.

రెండు రోజుల క్రితం.. పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ మృతి..

రెండ్రోజులక్రితం సిరిసిల్లలో పోలీస్‌ బెటాలియన్‌ కమాండెంట్‌ గంగారాం లిఫ్ట్‌ ప్రమాదానికి ప్రాణాలు కోల్పోయారు.. సిరిసిల్లలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోన్న గంగారం.. లిఫ్ట్‌ ఎక్కే ప్రయత్నంలో కిందపడి చనిపోయారు. లిఫ్ట్‌ వచ్చిందనుకుని డోర్‌ ఓపెన్‌ చేసిన గంగారాం.. అందులో పడిపోయారు.. తీవ్ర గాయాల పాలైన గంగారాం.. ఆస్పత్రికి తరలించేలోపే మృత్యువాత పడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..