Telangana: 2 వేలు పెట్టుబడి పెడితే సూపర్ ప్రాఫిట్.. ఆపై 69 లక్షలు ఇన్వెస్ట్.. కట్ చేస్తే..

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో అమాయకుల బ్యాంక్‌ ఖాతాలను కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. సంగారెడ్డిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భారీగా మోసపోయాడు. లాభాలు ఇప్పిస్తామని చెప్పడంతో పలు దఫాలుగా రూ.69 లక్షలు జమ చేశాడు బాధితుడు. చివరకూ మోసపోయానని గ్రహించి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

Telangana: 2 వేలు పెట్టుబడి పెడితే సూపర్ ప్రాఫిట్.. ఆపై 69 లక్షలు ఇన్వెస్ట్.. కట్ చేస్తే..
Stock Trading
Follow us

|

Updated on: May 26, 2024 | 9:30 PM

సంగారెడ్డి జిల్లాలో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ట్రేడింగ్‌కు సంబంధించిన మెసేజ్‌ రావడంతో.. వివరాలను యాప్‌లో నమోదు చేసిన అమీన్‌పూర్‌ పరిధిలోని భవానీపురానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి భారీగా మోసపోయాడు. లాభాలు ఇప్పిస్తామని చెప్పడంతో పలు దఫాలుగా రూ.69 లక్షలు జమ చేశాడు బాధితుడు. చివరకూ మోసపోయానని గ్రహించి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదులో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొదట యాప్‌లో రూ.2 వేలు పెట్టుబడి పెట్టిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగికి లాభాలు చూపించారు. లాభాలు భారీగా రావడంతో తర్వాత 15.37లక్షలు యాప్‌లో జమ చేశాడు. తన లాభం, అసలు డబ్బు చెల్లించాలని కోరగా యాప్‌ నుంచి స్పందన లేదు. అమీన్‌పూర్‌ పరిధిలోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన స్టాక్‌ ట్రేడర్‌ ఆన్‌లైన్‌లో ట్రేడింగ్‌ చేస్తుండేవాడు. ఆయన కూడా ఇలాగే సైబర్‌ వలకు చిక్కాడు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌లో 27.71 లక్షలు జమ చేశాడు.

కొన్ని రోజుల తర్వాత యాప్‌ మార్ఫింగ్‌ లోగోతో ఉన్నట్టు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి వద్దనే ఉంటూ సింపుల్ గా లక్షలు సంపాదించాలనే ఆశతో సైబర్ నేరగాళ్లు పంపే లింక్‌లను క్లిక్‌ చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు యాప్‌లో పెట్టుబడి పెట్టండి..టాస్క్‌లు పూర్తి చేస్తే లక్షల్లో డబ్బు ఇస్తాం..కేవలం ఫొటోలకు, వీడియోలకు లైక్‌ కొట్టి వేలల్లో సంపాదించొచ్చు అంటూ ఇలా సైబర్‌ నేరగాళ్లు ఎంతోమందిని బురిడీ కొట్టేస్తున్నారు. లక్షల్లో డబ్బును కాజేస్తున్నారు. ఇలాంటి కేసులు ఒక్క సంగారెడ్డి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 323 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు బాధితులు సైబర్‌ నేరగాళ్ల చేతిలో 22.71 కోట్ల వరకు మోసపోయారు. ఇందులో సకాలంలో బాధితులు ఫిర్యాదు చేయగా రూ.3.62 కోట్ల వరకు ఫ్రీజ్‌ చేసారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్‌ఐ
ఆమ్యామ్యా తీసుకుంటూ అడ్డంగా బుక్కైన వెల్దండ ఎస్‌ఐ
సిమ్‌ కార్డు పోర్ట్‌ చేయాలంటే ఇక నుంచి అలా కుదరదు.. కొత్త రూల్స్
సిమ్‌ కార్డు పోర్ట్‌ చేయాలంటే ఇక నుంచి అలా కుదరదు.. కొత్త రూల్స్
ఇంగ్లండ్ పని పట్టాల్సిందే.. ఈ బలహీనతలపై దెబ్బ కొడితే సరే సరి
ఇంగ్లండ్ పని పట్టాల్సిందే.. ఈ బలహీనతలపై దెబ్బ కొడితే సరే సరి
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
కారు బీమా తీసుకుంటున్నారా.? ఆ ఒక్క జాగ్రత్తతో బోలెడన్ని లాభాలు
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
ఆ ప్రాజెక్టు తెలంగాణకు ఓ వరంగా మారుతుంది.. డిప్యూటీ సీఎం భట్టి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
అలర్ట్.. మూత్రవిసర్జన సమయంలో అలా జరుగుతుందా..? ఆలస్యం చేయకండి..
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
బీఎస్-4 వాహన సమస్యలకు ఎల్‌పీజీతో చెక్..కన్వెర్షన్‌తోనే సమస్య ఫసక్
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
పాలసీదారులు అప్రమత్తంగా ఉండాలి.. హెచ్చరించిన ఎల్ఐసీ.. ఎందుకంటే..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..
సీన్ సీన్‌కు సుస్సు పడాల్సిందే.. దైర్యముంటేనే ఈ సినిమా చూడండి..