సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో పొగలు.. బీబీనగర్‌లో చైన్‌ లాగేసిన ప్రయాణికులు..!

|

Dec 10, 2023 | 11:46 AM

బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి పొగలు వస్తున్న విషయాన్ని ప్రయాణీకులు గుర్తించారు. ఒక్కసారిగా రైలులో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణీకులు చైన్ లాగి రైలును నిలిపివేసినట్టుగా తెలిసింది. ఈ సంఘటన సికింద్రాబాద్ -సిర్పూర్‌లో ఈరోజు ఉదయం 9:15 గంటలకు జరిగినట్టుగా సీపీఆర్వో రాకేష్‌ తెలిపారు.

సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైలులో పొగలు.. బీబీనగర్‌లో చైన్‌ లాగేసిన ప్రయాణికులు..!
Trains
Follow us on

యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 10: సికింద్రాబాద్-సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో పొగలు వ్యాపించాయి. బ్రేక్ బైండింగ్ సమస్య కారణంగా ఈ ఉదయం రైల్లో పొగలు వచ్చినట్లుగా దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు నుండి పొగలు వస్తున్న విషయాన్ని ప్రయాణీకులు గుర్తించారు. ఒక్కసారిగా రైలులో పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణీకులు చైన్ లాగి రైలును నిలిపివేసినట్టుగా తెలిసింది.

బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. బ్రేక్ లైనర్ పట్టేయడంతో రైలులో పొగలు వచ్చినట్టుగా రైల్వే అధికారులు గుర్తించారు. రైలును అక్కడే నిలిపివేసి మరమ్మతులు నిర్వహించారు. మరమ్మతుల అనంతరం తిరిగి రైలును పంపించివేసినట్టుగా సమాచారం.

బీబీనగర్‌లో రైలును 15 నిమిషాల పాటు నిలిపివేసి, ఆన్‌బోర్డ్ సిబ్బంది బ్రేక్‌లు విడదీసి, మరమ్మతులు పూర్తి చేశారు. ఆ తర్వాత రైలు సాధారణంగా ప్రయాణాన్ని కొనసాగించింది. ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన సికింద్రాబాద్ -సిర్పూర్‌లో ఈరోజు ఉదయం 9:15 గంటలకు జరిగినట్టుగా సీపీఆర్వో రాకేష్‌ తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేకపోవటంతో ఇటు ప్రయాణికులు, రైల్వే అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..