నేను హిందువునే.. వాటికన్‌ కూడా వెళ్లా.. TV9తో మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌ కామెంట్స్..!

సంచయిత గజపతిరాజు.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కూతురు ఈ సంచయిత. అయితే ఆనంద గజపతి మొదటి భార్యకు గతంలోనే విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత.. ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తిని వివాహమాడినట్లు తెలుస్తోంది. అయితే ఈమె పేరు ఎవరికీ మొన్నటి వరకు చాలా మందికి తెలియకున్నా.. జగన్ సర్కార్ మన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం […]

నేను హిందువునే.. వాటికన్‌ కూడా వెళ్లా.. TV9తో మాన్సాస్ ట్రస్ట్ చైర్‌పర్సన్‌ కామెంట్స్..!
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2020 | 8:59 PM

సంచయిత గజపతిరాజు.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు మొదటి భార్య కూతురు ఈ సంచయిత. అయితే ఆనంద గజపతి మొదటి భార్యకు గతంలోనే విడాకులు ఇచ్చేశారు. ఆ తర్వాత.. ఆమె ఇతర మతానికి చెందిన వ్యక్తిని వివాహమాడినట్లు తెలుస్తోంది. అయితే ఈమె పేరు ఎవరికీ మొన్నటి వరకు చాలా మందికి తెలియకున్నా.. జగన్ సర్కార్ మన్సాస్ ట్రస్ట్ చైర్మన్, సింహాచలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవులను కట్టబెట్టడంతో ఇప్పుడు ఈమె పేరు చర్చనీయాంశంగా మారింది. అందుకు ప్రధాన కారణం.. ఆమె హిందువుకాదంటూ వస్తున్న వార్తలే. దీంతో సంచయిత తాను హిందువు కాదంటూ వస్తున్న వార్తలను టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ఖండించారు.

తాను హిందువునేనని.. అయితే వాటికన్‌ సిటీ చర్చికి కూడా వెళ్లానని తెలిపారు. అంతేకాకుండా గురుద్వార, మసీదుకు కూడా వెళ్తాననీ స్పష్టం చేశారు. మాన్సాస్‌ ట్రస్టుకి, సింహాచలం దేవస్థానానికి సేవ చేయడానికే ఇక్కడకు వచ్చానని.. నేను సేవ చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో గతం నుంచి సేవా కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు. తన నియామకం రాజకీయపరమైంది కాదనీ, అవసరమైతే ఈ విషయంపై చట్టపరంగా పోరాడతానని తెలిపారు.