Telangana: మీ పిల్లలకు బండి ఇస్తున్నారా..? ఇది చదివితే గుండె గుభేలే..
సిద్దిపేట పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్ లకు న్యాయమూర్తి వినూత్న రీతిలో శిక్ష విధించారు. మైనర్ లకు వినూత్న రీతిలో శిక్ష విధించడంతో పాటు తల్లిదండ్రులకు భారీ జరిమానా విధించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో 39 మైనర్లు పట్టుపడ్డారు.

మైనర్లు బండి నడిపితే పోలీసులు హెచ్చరిస్తారు. లేకపోతే ఫైన్ వేస్తారు కానీ.. సిద్దిపేటలో మాత్రం వారి వ్యక్తిత్వాన్ని మారుస్తూ సమాజానికి పనికొచ్చే శిక్ష వేశారు. నేటి కాలంలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు, న్యాయస్థానాలు కఠినమైన, అలాగే కొన్నిచోట్ల “వెరైటీ” శిక్షలను అమలు చేస్తున్నాయి. సిద్దిపేటలో కూడా ఇలాగే 39 మంది మైనర్లు లైసెన్స్ లేకండా బైక్ నడిపినందుకు వైరేటి శిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన మైనర్ లకు న్యాయమూర్తి వినూత్న రీతిలో శిక్ష విధించారు. మైనర్ లకు వినూత్న రీతిలో శిక్ష విధించడంతో పాటు తల్లిదండ్రులకు భారీ జరిమానా విధించారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో 39 మైనర్లు పట్టుపడ్డారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 39 మైనర్లపై ఛార్జ్‌షీట్ నమోదు చేసి, వారిని కోర్టులో హాజరుపరిచారు. కేసును విచారించిన మెజిస్ట్రేట్ నిబంధనలు ఉల్లంఘించిన 39 మైనర్లకు వినూత్న శిక్షను విధించారు.
సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువు పరిసరాల్లో మొక్కలు నాటాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని మెజిస్ట్రేట్ ఆదేశించారు. అంతే కాకుండా మైనర్లకు వాహనాలు ఇచ్చినందుకు గానూ, వారి తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున భారీ జరిమానా విధించారు.
ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని తల్లిదండ్రులను సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విధించారు..కొన్ని సందర్భాల్లో న్యాయస్థానాలు జైలు శిక్షకు బదులుగా మైనర్లలో మార్పు తెచ్చేందుకు ఇలాంటి వినూత్న శిక్షలను విధిస్తున్నాయి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
