AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. అంతలోనే ఎస్ఐని ఢీకొట్టి..

హైదరాబాద్‌లో పకడ్బంధీగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను సీజ్ చేస్తున్నారు.. అయినా.. కొంతమంది ఏం తెలియనట్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు.. వాహనాన్ని ఆపిన ఎస్ఐనే ఢీకొట్టారు.. దీంతో ఎస్ఐ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

Hyderabad: డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా దూసుకొచ్చిన కారు.. అంతలోనే ఎస్ఐని ఢీకొట్టి..
Hyd Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jan 25, 2026 | 9:15 PM

Share

తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే సహించేది లేదు.. తాగి వాహనం నడపొద్దు.. మీతో పాటు.. ఇతరు ప్రాణాలను బలికొనవద్దు.. అంటూ పోలీసులు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ ఆపేందుకు పోలీసులు ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు.. పకడ్బంధీగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాలను సీజ్ చేస్తున్నారు.. అయినా.. కొంతమంది ఏం తెలియనట్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా.. మద్యం మత్తులో మందుబాబులు రెచ్చిపోయారు.. వాహనాన్ని ఆపిన ఎస్ఐనే ఢీకొట్టారు.. దీంతో ఎస్ఐ తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న సమయంలో ఎస్ఐ మధు ఓ కారును అడ్డగించే ప్రయత్నం చేశారు. కారును ఆపేందుకు వస్తున్న ఎస్ఐ మధుపైకి కారు దూసుకొచ్చింది.. దీంతో మధు ఒక్కసారిగా కారు బానెట్ పై పడిపోయారు.. కారు బానేట్ పై ఉండగా ఎస్సై మధును సుమారు 400 మీటర్ల వరకు కారు డ్రైవర్ తీసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం మాల్ అనే గ్రామంలో ఎస్ఐ మధు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.

యాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న క్రమంలో.. ఎస్ఐ ను కారు ఢీకొట్టి హైదరాబాద్ వైపు దూసుకెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. సాయి శరణం గార్డెన్ వద్ద కారు స్లో చేయగానే ఎస్సై దూకేశారు. ఎస్సై మధు కారు బానెట్ పై ఉండాగానే యాచారం అంబేద్కర్ చౌరస్తాలో కారు.. బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.. యువతికి చేయి విరిగింది. ఇబ్రహీంపట్నం వద్ద కారును నిలిపి పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.. మాల్ పీపుల్స్ హాస్పిటల్ లో చికిత్స పొంది తిరిగి ఎస్ఐ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.

వీడియో చూడండి..

ఇద్దరు యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. యాచారం కారు ఘటనలో ఎస్సై మధుకు గాయాలు కాగా.. మరో యువతికి చెయ్యి విరిగినట్లు పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..