Telangana: కన్నెర్రచేసిన శివస్వాములు.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరీ దాడి చేసిన వైనం..

మాలధారణలో ఉన్న ఓ వ్యక్తిపై దాడి జరిగితే.. చుట్టుపక్కల ఉన్న శివమాలధారులు అంతా ఒక్కటయ్యారు. పోలీస్ స్టేషన్ చేరుకుని వీరంగం సృష్టించారు. ఇంతకీ ఈ గొడవకు అసలు

Telangana: కన్నెర్రచేసిన శివస్వాములు.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి మరీ దాడి చేసిన వైనం..
Shiva Swamy
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 01, 2023 | 9:23 AM

మాలధారణలో ఉన్న ఓ వ్యక్తిపై దాడి జరిగితే.. చుట్టుపక్కల ఉన్న శివమాలధారులు అంతా ఒక్కటయ్యారు. పోలీస్ స్టేషన్ చేరుకుని వీరంగం సృష్టించారు. ఇంతకీ ఈ గొడవకు అసలు కారణమేంటి? అసలేం జరిగిందనేది చూద్దాం.

వికారాబాద్ జిల్లా యాలాల మండలం దేవనూరు గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ పెద్ద వివాదానికి దారి తీసింది. శివ మాల వేసిన వ్యక్తిపై మరో వ్యక్తి దాడి చేయడాన్ని నిరసిస్తూ శివ స్వాములు యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ నారాయణపూర్ చౌరస్తా దగ్గర మెరుపు ధర్నాకు దిగారు. శివ స్వాములపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్న మాలధారులు.. రోడ్డుపై బైటాయించారు. మాలలో ఉన్న వ్యక్తిపై దాడిని నిరసిస్తూ.. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. శివ స్వామిపై దాడి చేసిన వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఉన్నాడని తెలుసుకున్న శివ స్వాములు.. లక్ష్మీనారాయణపూర్ నుంచి నేరుగా యాలాల పోలీస్ స్టేషన్‌కు చేరుకుని.. వీరంగం సృష్టించారు.

దాడి చేసిన వ్యక్తిని కాకుండా మరో వ్యక్తిని చితక బాదారు. వీరిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన సందీప్ గౌడ్ అనే కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలయ్యాయి. శివ స్వాముల వీరంగం విషయం తెలుసుకున్న తాండూరు రూరల్ సీఐ రాంబాబు.. తన సిబ్బందితో హుటాహుటిన యాలాల పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఐ రాంబాబు పోలీస్ స్టేషన్‌లో దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేశారు. చిన్నపాటి గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి ఇరువర్గాలు కేసులు పెట్టుకునే వరకూ వెళ్లింది. పోలీస్ స్టేషన్‌లో శివస్వాముల దాడి దృశ్యాలు.. అక్కడున్న సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో యాలాల పోలీస్ స్టేషన్‌లో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..