AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం ట్విస్టులు రా నాయన.. ప్రియురాలి మొగుడినే కాదు.. సొంత భార్యను సైతం..!

సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు షేక్ చేస్తున్నాయి. ఒక్క తేజేశ్వర్‌ను మాత్రమే కాదు, కట్టుకున్న భార్యను సైతం హత్య చేయాలని ప్లాన్ వేశాడు కీలక సూత్రధారి తిరుమలరావు. అనివార్య కారణాలతో వెనక్కి తగ్గి ఐశ్వర్యతో శారీరక సంబంధం కొనసాగించేందుకు తేజేశ్వర్‌ను అడ్డు తొలగించుకోవాలని మరో ప్లాన్ చేశాడు

ఏం ట్విస్టులు రా నాయన.. ప్రియురాలి మొగుడినే కాదు.. సొంత భార్యను సైతం..!
Gadwal Murder Twist
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jun 24, 2025 | 6:53 PM

Share

గద్వాల జిల్లా సర్వేయర్ తేజేశ్వర్ మర్డర్ కేసులో విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు షేక్ చేస్తున్నాయి. ఒక్క తేజేశ్వర్‌ను మాత్రమే కాదు, కట్టుకున్న భార్యను సైతం హత్య చేయాలని ప్లాన్ వేశాడు కీలక సూత్రధారి తిరుమలరావు. అనివార్య కారణాలతో వెనక్కి తగ్గి ఐశ్వర్యతో శారీరక సంబంధం కొనసాగించేందుకు తేజేశ్వర్‌ను అడ్డు తొలగించుకోవాలని మరో ప్లాన్ చేశాడు. అంతేకాదు ఆ పని పూర్తయితే కొన్నాళ్ళు ఎంజాయ్ చేసేందుకు లధక్ ట్రిప్ సైతం స్కెచ్ వేసుకున్నారు తిరుమల రావు, ఐశ్వర్య.

తేజేశ్వర్ ప్రతి మూమెంట్‌ను ట్రాక్ చేయడానికి బైక్ కీలో జీపీఎస్ అమర్చింది ఐశ్వర్య. ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు.. ఎక్కడయితే హత్య సులభం అవుతుందని కదలికలు ట్రాక్ చేశారు. హత్య ప్లాన్ చేసినప్పటి నుండి తిరుమలరావుతో ప్రతి అంశం షేర్ చేసింది ఐశ్వర్య. అయితే జీపీఎస్ ప్లాన్ వర్కవుట్ కాలేదు. దీంతో సర్వే పేరుతో తేజేశ్వర్‌ను కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతంలో చంపాలని పథకం రచించారు. సుఫారీ మర్డర్ ప్లాన్ కుదిరినప్పటి నుండి పలు మార్లు గద్వాల్‌లో తేజేశ్వర్ పై నిఘా పెట్టి రెక్కి నిర్వహించారు నిందితులు.

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం జూన్ 17 వ తేదీన ఉదయం గద్వాల్ లో తేజేశ్వర్ ను కారు లో ఎక్కించుకున్నారు నిందితులు. కారు గద్వాల్ జిల్లా కేంద్రం దాటగానే ముందు సీటులో కూర్చున్న తేజేశ్వర్‌ను వెనక నుండి దాడి చేశారు పరశురామ్, రాజు. ఒకరు గట్టిగా పట్టుకోగా మరొకరు తేజేశ్వర్ గొంతు కోశారు. అదే సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నగేష్ సైతం తేజేశ్వర్‌ను కత్తితో పొడిచాడు. తేజేశ్వర్ ప్రతిఘటించడంతో నగేష్ చేతికి గాయమైంది. తేజేశ్వర్ చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత తిరుమలరావుకు సమాచారం అందించారు నిందితులు.

గద్వాల్ నుండి డెడ్ బాడీని తిరుమలరావుకు చూపించడానికి కర్నూల్‌కు తీసుకెళ్లారు. మర్డర్ కన్ఫర్మ్ చేసుకున్న తిరుమల రావు నిందితులకు రెండు లక్షల పైచిలుకు డబ్బులను మూట చెప్పేవాడు. అయితే డెడ్ బాడీని తిరుమల రావు వెంచర్‌లో దహనం చేయాలని భావించారు నిందితులు. అక్కడ జనాల సంచారం ఉండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. తర్వాత గాలేరు నగరి కాలువలో పడేసి ఎవరికివారు వెళ్ళిపోయారు.

ఇదిలా ఉంటే బయటికి పని మీద వెళ్లిన తేజేశ్వర్ రాకపోవడంతో జూన్18వ తేదీన అన్న తేజవర్ధన్ గద్వాల్ టౌన్ లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎంక్వయిరీ ప్రారంభించారు. ఐశ్వర్యను కూడా విచారణ చేశారు. తనకేం సంబంధం లేనట్లు.. తెలియనట్లు అమాయకంగా నటించింది ఐశ్వర్య.. పోలీసులు మిస్సింగ్ కేసు అంశాన్ని చూస్తున్నారని తిరుమల రావుకు సమాచారం అందించింది. అయితే మనమీద ఎవరికీ అనుమానం రాలేదని తిరుమలరావుకు తెలిపింది ఐశ్వర్య.

ముందుస్తు ప్రణాళిక ప్రకారమే తేజేశ్వర్ హత్య జరిగింది. ఐశ్వర్యతో శారీరక సంబంధం నేపథ్యంలో ఆమెనే రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే అంశాన్ని కట్టుకున్న భార్యకు సైతం చెప్పాడు. గొడవ జరగడంతో వెనక్కి తగ్గాడు. అయితే ఐశ్వర్యతో జీవితం పంచుకోవాలన్న ఆశతో మొదట భార్యను.. ఆతర్వాత తేజేశ్వర్ హత్యకు ప్లాన్ చేశాడు. కుటుంబ సభ్యులు, బంధువులు వద్ద చెడ్డ పేరు వస్తుందన్న భావనతో ఆలోచనను విరమించుకున్నాడు. ఐశ్వర్యతో వివాహేతర సంబంధం కొనసాగించేందుకు తేజేశ్వర్‌ను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. తన కారు డ్రైవర్ తోపాటు కర్నూల్‌కు చెందిన మరో ఇద్దరితో బేరం కుదుర్చుకుని హత్య

మరచేయించాడు. ఇక తేజేశ్వర్ హత్య తర్వాత ముందస్తు ప్రణాళిక ప్రకారం కొన్నాళ్ళు లధక్ వెళ్ళి ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఐశ్వర్య, తిరుమల రావు. డెడ్ బాడీ లేకుండా చేస్తే కేసు మిస్సింగ్ కేసు గానే ఉంటుంది. తమ బంధానికి ఎవరు అడ్డు ఉండరని తిరుమలరావు, ఐశ్వర్య భావించారు. అయితే తేజేశ్వర్ డెడ్ బాడీ దొరకడంతో పోలీసులు విచారణ వేగవంతం చేసి ఐశ్వర్య తోపాటు ఆమె తల్లి సుజాతను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలియడంతో తిరుమలరావు కర్నూల్ నుంచి హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఈ మొత్తం వ్యవహారం లో తిరుమల రావు దొరికితే మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగు బృందాలుగా తిరుమల రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..