Special Trains: వేసవికాలంలో ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసకొస్తుంది దక్షిణ మధ్య రైల్వే (South Central Railway). అలాగే విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలను సందర్శించుకోవాలనుకునే వారికోసం కూడా స్పెషల్ సర్వీసులను ఏర్పాటుచేస్తోంది. ఈక్రమంలోనే హైదరాబాద్, పింక్‌సిటీగా పేరొందిన జైపూర్ (Hyderabad- Jaipur)ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. 07115 నంబర్ గల రైలు మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24 (అన్నీ శుక్రవారాలే) తేదీల్లో రాత్రి 8.20 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు జైపూర్ చేరుకుంటుంది. అలాగే 07116 నంబర్ గల రైలు మే 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 (అన్నీ ఆదివారాలే) తేదీల్లో మధ్యాహ్నం 3.20 గంటలకు జైపూర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
కాగా ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ముఖేడ్, నాందేడ్, పూర్ణ, హింగోలి, బాస్మత్, వాషిమ్, అకోలా, మల్కాపూర్, ఖాండ్వా, ఇటార్సి, భోపాల్, ఉజ్జయిని, రత్లాం, మందసౌర్, నిమాచ్, చిట్టౌర్‌గఢ్, బిజాహిల్‌వారాఘర్, బిజారినగర్, అజ్మీర్, ఫులేరా. స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్లలో AC-II టైర్, AC-III టైర్ తో పాటు స్లీపర్ కోచ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. పింక్‌సిటీ అందాలను వీక్షించాలనుకునేవారు వీటిని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
16 Weekly Summer Special Trains between #Hyderabad and #Jaipur @drmsecunderabad @drmhyb pic.twitter.com/6nrZdU6zYT
— South Central Railway (@SCRailwayIndia) May 5, 2022
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read:
Darshanam Mogilaiah: కిన్నెర మొగిలయ్య ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రమాదంలో కూతురి మృతి..
Liquor Dealers Strike: మద్యం ప్రియులకు భారీ షాక్.. 15 రోజులపాటు మద్యం వ్యాపారుల సమ్మె..!