TS 10th Time Table : తెలంగాణ పదవతరగతి పరీక్ష షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. విద్యార్థులకు గుడ్ న్యూస్

కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల..

TS 10th Time Table : తెలంగాణ పదవతరగతి పరీక్ష షెడ్యూల్‌ను రిలీజ్ చేసిన విద్యాశాఖ.. విద్యార్థులకు గుడ్ న్యూస్
Follow us
Surya Kala

|

Updated on: Feb 09, 2021 | 4:51 PM

TS SSC Examinations Schedule: కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో టెన్త్ విద్యార్థులకు ఆరు పరీక్షలే ఉంటాయని విద్యాశాఖ తెలిపింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్షల ను నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షల షెడ్యూల్ వివరాలు :

1. మే 17న ఫస్ట్‌ లాంగ్వేజ్ (తెలుగు) పరీక్ష

2. 18న సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ) పరీక్ష

3. మే 19న ఇంగ్లిష్‌ పరీక్ష

4. మే 20న మ్యాథ్స్‌ (గణితం) పరీక్ష

5. మే 21న సామాన్యశాస్తం పరీక్ష

6. మే 22న సాంఘికశాస్త్రం పరీక్ష

ఇక మే 24న ఒకేషనల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1

25న ఒకేషనల్‌ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-2

26న ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష

ఈ మేరకు విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ను ప్రకటించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని.. సానిటైజర్, భౌతిక దూరం పాటించేలా అన్ని జాగ్రత్తలు పాటిస్తామని విద్యాశాఖ తెలిపింది.

Also Read: