Hyderabad: బంగారం ఊరికే రాదు.. గోల్డ్ కొనడానికి అంటూ షాప్స్ కి వెళ్లి.. నగలు కొట్టిస్తున్న యువతి.. వీడిన మిస్టరీ..

| Edited By: Surya Kala

Jan 06, 2024 | 7:32 AM

హైదరాబాద్ అమీర్పేట్ లో ఉన్న ఓ బంగారం షాప్ కు వెళ్ళింది గౌతమి. సేల్స్ మాన్ ను మాటల్లో పెట్టిన గౌతమి రకరకాల గొలుసులను చూపించాలని కోరింది. సేల్స్ మాన్ పక్కకు వెళ్ళగానే షాప్ లోని గొలుసును అపహరించి దాని ప్లేస్ లో తనతో తెచ్చుకున్న గొలుసును అమర్చేది. దాదాపు అరగంట పాటు డిజైన్స్ అన్ని చూశాక తనకు ఏ డిజైన్ నచ్చలేదని సేల్స్ మాన్ తో చెప్పి యదేచ్చగా కొట్టేసిన గొలుసుతో బయటపడేది..

Hyderabad: బంగారం ఊరికే రాదు.. గోల్డ్ కొనడానికి అంటూ షాప్స్ కి వెళ్లి.. నగలు కొట్టిస్తున్న యువతి.. వీడిన మిస్టరీ..
Jewellery Thief
Follow us on

హైదరాబాదులో యువతీ తీరుతో పోలీసులు అవాకవుతున్నారు.. గోల్డ్ షాప్ లోనే టార్గెట్ గా చేసుకొని యువతి మోసాలకు పాల్పడుతుంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌతమి అనే యువతి గోల్డ్ షాపులను టార్గెట్గా చేసి సేల్స్ మెన్ ను అటెన్షన్ డైవర్షన్ చేసి గోల్డ్ చైన్లను కొట్టేయటంలో దిట్టగా మారింది. పక్క ఆధారాలతో యువతినీ అరెస్టు చేసారూ మీర్పెట్ పోలీసులు.. అయితే యువతి ప్లాన్ తెలుసుకొని పోలీసులు సైతం షాక్ కు గురవుతున్నారు. సీసీ కెమెరాలు లేకుంటే యువతీని పట్టుకోవడం అసాధ్యమయ్యేదని పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్ అమీర్పేట్ లో ఉన్న ఓ బంగారం షాప్ కు వెళ్ళింది గౌతమి. సేల్స్ మాన్ ను మాటల్లో పెట్టిన గౌతమి రకరకాల గొలుసులను చూపించాలని కోరింది. సేల్స్ మాన్ పక్కకు వెళ్ళగానే షాప్ లోని గొలుసును అపహరించి దాని ప్లేస్ లో తనతో తెచ్చుకున్న గొలుసును అమర్చేది. దాదాపు అరగంట పాటు డిజైన్స్ అన్ని చూశాక తనకు ఏ డిజైన్ నచ్చలేదని సేల్స్ మాన్ తో చెప్పి యదేచ్చగా కొట్టేసిన గొలుసుతో బయటపడేది.. ఇలా గోల్డ్ చైన్ కు బదులు అందులో నకిలీ బంగారపు గొలుసులు గమనించిన సేల్స్ మెన్ సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించాడు. అందులో గౌతమి గొలుసులను మార్చిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. వెంటనే మీర్పేట్ పోలీసులకు బంగారం షాప్ నిర్వాహకుడు ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు సిసిటీవీ కెమెరాల ఆధారంగా గౌతమిని అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో తాను గతంలో సైతం ఇలాంటి నేరాలకు పాల్పడినట్టు గౌతమి ఒప్పుకుంది. జూబ్లీహిల్స్, సరూర్నగర్, చైతన్య పూరీ, kphb పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఇలాంటి చోరీలు చేసినట్టు ఒప్పుకుంది. పక్క ఆధారాలతో గౌతమిని అరెస్టు చేసిన పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 14 రోజుల రిమాండ్ లో భాగంగా చంచల్గడా మహిళ జైల్ కు గౌతమిని తరలించారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..