Hyderabad: పల్లె నుంచి పట్నం బాట.. హైదరాబాద్‌కి వచ్చే రహదారులన్నీ కిటకిట..

|

Jan 17, 2023 | 7:58 AM

పండక్కి పల్లెకు వెళ్లిన వారంతా తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రోడ్లన్నీ ఫుల్ రష్ గా మారాయి.. హైదరాబాద్ కి వచ్చే దారులన్నీ..

Hyderabad: పల్లె నుంచి పట్నం బాట.. హైదరాబాద్‌కి వచ్చే రహదారులన్నీ కిటకిట..
Traffic Jam
Follow us on

పండక్కి పల్లెకు వెళ్లిన వారంతా తిరిగి పట్నం బాట పట్టారు. దీంతో విజయవాడ హైదరాబాద్ రోడ్లన్నీ ఫుల్ రష్ గా మారాయి.. హైదరాబాద్ కి వచ్చే దారులన్నీ.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ తో కనిపించాయి. మరీ ముఖ్యంగా టోల్ ప్లాజాల దగ్గర రద్దీ వాతావరణం కనిపించింది.

సంక్రాంతి పండక్కి.. సొంతూళ్లకు వెళ్లిన వారు నగరానికి తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో హైదరాబాద్ కి వచ్చే రహదారులన్నీ కిటకిటలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా దగ్గర ఫుల్ ట్రాఫిక్ కనిపించింది.. మొత్తం పదహారు బూతులకుగానూ తొమ్మిది బూతులను హైదరాబాద్ వైపు తెరిచారు. వీటిలో ఫాస్టాగ్ కి సంబంధించినవి 8 ఉండగా. కేవలం ఒక్కటంటే ఒక్క బూతు మాత్రమే నగదు చెల్లింపునకు కేటాయించారు. అన్నింటిలోనూ ట్రాఫిక్ రద్దీ కనిపించింది. బండి ఎంతకీ ముందుకు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి కనిపించింది.

కనుమ పండగ రోజు కూడా కొన్ని ఆఫీసులు తెరుచుకోవడంతో పల్లెకు వెళ్లిన లక్షలాది మందిలో సగం వరకూ తిరిగి సిటీకి వచ్చేశారు. దీంతో చాలా మంది ఆదివారం రాత్రి పిండివంటలతో కూడిన బ్యాగులు సర్దుకుని బండి ఎక్కేశారు. కొందరు సొంతకార్లలో రాగా.. మరికొందరు బైక్ అయినా సరే బేఫికర్ అంటూ దూసుకొచ్చేశారు.

ఇవి కూడా చదవండి

కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర కూడా వాహన రద్దీ భారీగా ఉండటంతో.. ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చాలా వరకూ వాహనాలకు ఫాస్టాగ్ ఉన్నా కూడా రద్దీ ఎంత మాత్రం తగ్గలేదు. ఇవాళ మధ్యాహ్నం వరకూ సరిగ్గా ఇలాంటి రద్దీయే ఉండేలా తెలుస్తోంది.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున స్పెషల్ బస్సులు నడుపుతున్నా.. రద్దీ తగ్గడం లేదు. కార్లు, బస్సులతో టోల్ ప్లాజాలు బారులు తీరి కనిపించాయి. నార్కట్ పల్లి- అద్దంకి హైవే లోని మాడుగుల టోల్ ప్లాజా దగ్గర కూడా సేమ్ సిట్యువేషన్. అటు వరంగల్- హైదరాబాద్ హైవై.. గూడూరు టోల్ ప్లాజా దగ్గర కూడా భారీ ఎత్తున ట్రాఫిక్ కనిపించింది.

ఆదివారం ముందు పండగ వచ్చి ఉంటే.. ఆ వీక్ మొత్తం విలేజ్ లోనే హాలిడేస్ ఎంజాయ్ చేసే వెసలుబాటు ఉండేది. కానీ పెద్ద పండగ సండే రావడంతో.. అందరూ ఆ రోజే బయలు దేరి ఆఫీసులకు రావల్సి వచ్చింది. మిగిలిన కొందరు సోమవారం నాడు స్టార్ట్ కావడంతో.. రద్దీ ఈ రెండు రోజుల పాటు భారీ ఎత్తున కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రైన్లలోనూ పెద్ద ఎత్తున రష్ కనిపించింది. జనరల్ కంపార్ట్ మెంట్లు అయితే పూర్తిగా నిండిపోయి కనిపించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..