Telangana: గంజాయి వాడకంలో దేశంలో తెలంగాణ ఏ స్థానంలో ఉందో తెల్సా…
డ్రగ్స్ వాడకంలో జాతీయ స్థాయిలో తెలంగాణది ఏ స్థానం? డబ్బున్నోళ్ల డ్రగ్ ఏంటీ? సామాన్యులను చిత్తు చేస్తోన్న నాటు సరుకు ఏంటి? కాస్ట్లీ కొకైన్ రుచి మరిగిన వాళ్లెందరు? ఆపరేషన్ త్రిశూల్‌తో తెలంగాణ డ్రగ్ ఫ్రీ స్టేట్ కాబోతుందా? టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యతో టీవీ9 ఎక్స్‌క్లూజివ్ ఇంటర్యూలో సంచలనాలు తెరపైకి వచ్చాయి.

తెలంగాణలో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చుతాం అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటతో మార్పు మొదలైంది. ఉక్కుపాదం మార్క్ కన్పిస్తోంది. డ్రగ్స్, గంజాయి బ్యాచ్‌ల బెండు తీస్తున్నారు. తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్టంగా చేయాలన్న సర్కార్ సంకల్పానికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్ పోలీసు,, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్.. టీజీ న్యాబ్ ఆధ్వర్యంలో త్రిశూల్ ఆపరేషన్ కేటుగాళ్ల వెన్నులో వణుకు రేపుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు సహా జిల్లాల్లోనూ డ్రగ్ నెట్ వర్క్‌కు కళ్లెం పడుతోంది. టీవీ9తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో సంచలనాల అంశాలను ప్రస్తావించారు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. నివేదికల ప్రకారం తెలంగాణ కొకైన్ వాడకంలో మూడో స్థానంలో.. గంజాయి వాడకంలో ఐదో స్థానంలో ఉందన్నారు. 40 వేల మంది కొకైన్‌కు ఎడిక్టయిన వాళ్లున్నారన్నారు..
తెలంగాణ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా కావాలంటే ముందుగా స్కూళ్లు, ఇంజినీరింగ్,మెడికల్ కాలేజీలు, వర్సిటీ క్యాంపస్‌లను డ్రగ్ ఫ్రీ చేయాల్సిన అవసరం వుందన్నారు. అలాగే పల్లెబాటలో కూడా డ్రగ్స్ కట్టడిపై సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. తెలిసో తెలియకో డ్రగ్ మాఫియా ట్రాప్‌లో పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎంతో భవిష్యత్ వున్న పిల్లలు డ్రగ్స్‌కు బానిసవరం చూస్తే బాధేస్తుందన్నారు.అలాంటి వారిలో పరివర్తను తీసుకురావడం ముఖ్యమన్నారు. ఆదిశగా చర్యలు చేపడుతున్నామన్నారు సందీప్ శాండిల్య
డ్రగ్స్,గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. తనిఖీల్లో భారీగా సరుకుపట్టుపడుతోంది. అరెస్టులతో పాటు కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. రెండేళ్లలో తెలంగాణను డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తయారవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం టీవీ9 చేస్తోన్న కృషిని ఆయన అభినందించారు. తెర వెనుకనైనా సరే పబ్‌ల్లో నైనా సరే..పల్లెబాటలో నైనా సరే ఎక్కడ డ్రగ్స్ వాడిన మక్కెలిరగొట్టి జైలుపాలు చేయడం ఖాయం. . డ్రగ్స్ కొన్నా అమ్మినా బట్వాడా చేసిన వాడినా ఇట్టే గుర్తించేలా ప్రపంచంలోనే అత్యున్నతమైన టెక్నాలజీ తెలంగాణలో అందుబాటులో ఉందిప్పుడు.




